ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కల్కి. వైజయంతి మూవ్వీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
Kalki 2898 AD Movie Review కథ :
అది 2898 ఏడి.. ఆ టైం లో కాంప్లెక్స్ ఒకటి నిర్మించుకుని దాన్ని యాస్కిన్ (కమల్ హాసన్) పాలిస్తుంటాడు. అక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి. సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్ లోకి అడుగు పెట్టాలని చూస్తుంటాడు భైరవ (ప్రభాస్). నిర్జీవమైన స్థితిలో ఉన్న కాశీ పట్టణం మరో పక్క శంబాలా ఉంటాయి. సర్వతాలకు సంబంధించిన వారు శంబాలలో ఉంటారు. తమ కష్టాలను తీర్చడానికి కల్కి (దేవుడు) ఏదో ఒకరోజు వస్తాడని ఎదురుచూస్తుంటారు. ఇక అక్కడే ద్వార యుగం నుంచి అశ్వథ్ధామ (అమితాబ్ బచ్చన్) కల్కి రాక కోసం ఎదురుచూస్తుంటాడు. ఐతే సుమతి (దీపికా పదుకొనె) కడుపులో కల్కి ఉన్నాడని తెలుసుకున్న యాస్కిన్ ఆమెను తన కాంప్లెక్స్ లోకి తీసుకు రావాలని అనుకుంటాడు. భైరవకు ఆమెను బంధించి కాంప్లెక్స్ లోకి తీసుకు రావాలని యాక్సిన్ మనుషులు చెబుతారు. ఐతే సుమతిని కాపాడేందుకు అశ్వథ్ధామ ముందుంటాడు. అశ్వథ్ధామ, భైరవల మధ్య యుద్ధం జరుగుతుంది. దీనిలో ఎవరు గెలిచారు అన్నది కల్కి 2898 ఏడి కథ.
Kalki 2898 AD Movie Review విశ్లేషణ :
ఒక గొప్ప కథ.. అది కూడా మన పురాణాలను టచ్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కి అందించే ప్రయత్నంలో భాగంగా నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి అనే అద్భుతాన్ని సృష్టించాడని చెప్పొచ్చు. ఈ సినిమా తీయడానికి తను ఐదేళ్లు పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ప్రతి పాత్ర దాని ఎమోషన్ అన్ని సమపాళ్లలో కుదిరాయి. కల్కి సినిమా నిజంగానే ఒక విజువల్ ఫీస్ట్ అందిస్తుంది. ఇదివరకు తెలుగు సినిమాల్లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద కూడా చూడని ఎన్నో అద్భుతాలు ఈ సినిమాలో ఉన్నాయి.
ఖర్చు పెట్టిన ప్రతి రూపాయ్ కూడా తెర మీద కనిపించేలా చేశాడు నాగ్ అశ్విన్. ఐతే సినిమా మొదలవడం బాగానే మొదలైనా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో నరేషన్ వల్ల కాస్త ట్రాక్ తప్పినట్టు అవుతుంది. ఐతే ఇంటర్వల్ బ్యాంగ్ మళ్లీ గాడిలో పడేలా చేసింది. పోస్ట్ ఇంటర్వల్ సీన్స్ కూడా మళ్లీ ఏం జరుగుతుంది అన్నట్టుగా కన్ ఫ్యూజ్ గా ఉంటాయి. కానీ క్లైమాక్స్ మళ్లీ సినిమాను నిలబెట్టేలా చేశాయి.
కల్కి 2898 ఏడి సినిమా టికెట్ పెట్టి చూసిన ప్రతి సినిమా అభిమానికి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. సినిమా నిడివి కాస్త తగ్గించి అది కూడా ఫస్ట్ హాఫ్ లో ఆ స్లో నరేషన్ ట్రిం చేసి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. చెప్పాలనుకున్న కథ.. రాసుకున్న పాత్రలు.. చూపించిన విజువల్స్ ఇవన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను ఆవిష్కరించాయి.
కల్కి లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. ప్రభాస్ ఈ సినిమా కోసం పడిన కష్టం. నాగ్ అశ్విన్ ఐదేళ్ల కల మిగతా నటీనటుల ప్రతిభ ఇవన్ని కల్కిని నిలబెట్టాయి. సినిమా ఒక ఐ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
Kalki 2898 AD Movie Review నటీనటులు :
ప్రభాస్ భైరవ పాత్రలో హైస్ అండ్ లోస్ చూపించాడు. ఐతే క్లైమాక్స్ లో ఐతే ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో అశ్వథ్ధామ పాత్రలో అమితాబ్ అదరగొట్టారు. సినిమాలో ఆయన పాత్ర హైలెట్ అని చెప్పడం చిన్నమాటే అవుతుంది. సుప్రీ యాస్కిన్ గా కమల్ హాసన్ మరోసారి తన వర్సటై పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇక దీపిక పదుకొనె సుమతి పాత్రలో అదరగొట్టేసింది. రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని, పశుపతి, శోభన ఇలా అందరు వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం :
ఇలాంటి గ్రాండియర్ సినిమాకు సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో కెమెరా మెన్ వర్క్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. నాగ్ అశ్విన్ ఎలా చెప్పి ఈ సీన్స్ షూట్ చేయించాడో కానీ విజువల్స్ అన్ని వేరే లెవెల్ అనిపించాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సినిమా ఫీల్ ని కొనసాగించింది. బిజిఎం కూడా అదిరిపోయింది. మిగతా అన్ని టెక్నికల్ యాస్పెక్ట్స్ లో కల్కి ది బెస్ట్ అనిపించుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తప్పకుండా తెలుగు సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లే దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. కల్కి 3 గంటలు తన ప్రతిభతో నింపేశాడు. వైజయంతి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్లస్ పాయింట్స్ :
తెలుగు తెర మీద అద్భుతమైన విజువల్స్
భైరవ అశ్వథ్ధామ సీన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్
అక్కడక్కడ ఎమోషన్ మిస్
బాటం లైన్ :
కల్కి 2898AD.. ఐ ఫీస్ట్ విజువల్స్.. తప్పకుండా చూడాల్సిన సినిమా..
రేటింగ్ : 3.25/5