The Raja Saab : బాహుబలి స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న మూవీ రాజాసాబ్. ఈ మూవీకి మారుతీ డైరెక్టర్. ఇటీవలే కల్కి మూవీ సక్సెస్ తో ప్రభాస్ జోరుమీదున్నాడు. వరల్డ్ వైడ్ గా ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన హీరోగా మరోసారి రికార్డులు క్రియేట్ చేశాడు ప్రభాస్. అదే జోరుతో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది.
ఈ సినిమా వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 10, 2025 లో విడుదల కానుంది. ఈ సినిమా హారర్, రొమాంటిక్, కామెడీ కథతో వచ్చిన మూవీ. పీపులస్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక లవర్ బాయ్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో ఓ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. తమన్ మ్యూజిక్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ వీడియోలో ప్రభాస్ క్లాస్ లుక్ లో కనిపించాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.