Google Pay – phonepe : కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతున్న గూగుల్ పే, ఫోన్ పే.. కొత్త పేమెంట్ సిస్టమ్ ఏంటో తెలుసా..?

Google Pay – phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా అవి కూడా కస్టమర్స్ కి కొత్త ఆంక్షలను విధించే ఏర్పాట్లు చేస్తుంది. యుపిఐ ఆన్ లైన్ చెల్లిపుల సురక్షితను దృష్టిలో ఉంచుకుని ఇక మీదత అన్ని పేమెంట్స్ కు ఇక మీదట ఫేస్ స్కాన్, లేదా ఫింగర్ పింట్ స్కాన్ ని ప్రవేశ పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇదివరకు యుపిఐ పేమెంట్స్ కి పిన్ ఉంటే సరిపోతుంది. ఆ పిన్ ఎవరు కొట్టినా పేమెంట్స్ అయిపోయేవి. ఐతే దాని వల్ల కొందరు వాళ్ల ప్రమేయం లేకుండానే ఖాతాలో డబ్బులు ఖాళీ అవుతుండటం వల్ల పేమెంట్ సిస్టమ్ ని మరింత కట్టిదిట్టం చేయాలని చూస్తున్నారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్.పి.సి.ఐ కొత్త వ్యవస్థని తీసుకొచ్చే పనుల్లో ఉందని తెలుస్తుంది. ఆన్ లైన్ చెల్లిపులను సురక్షితం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్స్ కు 4, 6 అంకెల పాస్ వర్డ్ అదే పిన్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే ఈ పద్ధతి మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎన్.పి.సి.ఐ ఈసారి కొత్త స్టార్టప్ లతో చర్చలు జరిపి పిన్ కు బదులుగా బయోమెట్రిక్ చేయాలని చూస్తుంది.

Google Pay - phonepe : కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతున్న గూగుల్ పే, ఫోన్ పే.. కొత్త పేమెంట్ సిస్టమ్ ఏంటో తెలుసా..?
Google Pay – phonepe : కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతున్న గూగుల్ పే, ఫోన్ పే.. కొత్త పేమెంట్ సిస్టమ్ ఏంటో తెలుసా..?

Google Pay – phonepe కార్డ్ చెల్లింపూలకు ఓటీపీ..

యుపిఐ పేమెంట్స్ లో భాగంగా కార్డ్ పేమెంట్స్ మొబైల్ ఓటీపీని అవసరం చేస్తుంది. అంతేకాదు యుపిఐ పేమెంట్స్ కు పాస్ వర్డ్ లు కూడా అవసరం ఐతే వీటిని మార్చి బయోమెట్రిక్ లేదా ఫేస్ స్కాన్ ని ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు. ఐ ఫోన్ లాంటి వాటిని అన్ లాక్ చేయాలంటే ఫేస్ స్కానింగ్ అవసరం. పాస్ వర్డ్ కారణంగా అనేక రకాల ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి.

అందుకే దీన్ని అప్గ్రేట్ చేస్తూ ఫేస్ స్కాన్ పెడితే కొంత మేరకు ఇలాంటి మోసాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆన్ లైన్ చెల్లింపులపై ఆర్బీఐ ఆందోళన చేస్తున్న ఈ టైం లో ప్రత్యామ్నాయ మార్గాలుగా ఎన్.పి.సి.ఐ కొత్త వ్యవస్థలను రూపొందిస్తుంది. మరి ఈ సరికొత్త పేమెంట్ సిస్టమ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఫేస్ స్కాన్ పేమెంట్స్ అయితే కొంత మేర ఆన్ లైన్ మోసాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

Author