Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా ఆలూ ఫ్రైని ఎంతో ఇష్టంగా తింటారు. మరి ముఖ్యంగా చారు, పప్పు , సాంబారు కాంబినేషన్‌ లో బంగాళాదుంప కూర లేదా ఫ్రై తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగే ఉడికించిన కూరగాయలు , నూనెలో వేయించిన ఫ్రైలు ,గుడ్డు, మాంసం ఇలా ఏ వంటకంలో అయిన బంగాళాదుంపలు కాంబినేషన్‌ గా ఎంచుకుంటారు. మరి అలాంటి బంగాళదుంపలు ఎక్కువగా తినడం వలన ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయా , నష్టాలు ఉన్నాయా ? ఇది ఆరోగ్యానికి మేలును కలుగజేస్తుందా ? లేదా హాని కలిగిస్తుందా ? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

బంగాళదుంపల్లో విటమిన్లు ఖనిజాలు పోషకాలు వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే దీనిలో అధిక మోతాదులో గ్లూకోజ్ కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరగదు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలను అసలు తినకూడదు. అలాగే ఇందులో అధిక స్థాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఉండడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. అందుకే మధుమేహ సమస్యతో బాధపడేవారు బంగాళదుంప చేసిన వంటకాలు అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా... తస్మాత్ జాగ్రత్త...!
Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే వాటిల్లో ఒక్కటి సోయాబీన్స్. అయితే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం సోయాబీన్స్ తిన్నడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. సోయాబీన్స్ డయాబెటిక్ రోగులకు చక్కగా ఉపయోగపడుతుంది. బంగాళదుంపలను తినడం వలన బరువు పెరగడంతో పాటు కాళ్లు చేతులు వాపులు వస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలను అసలు తినకూడదు. దానికి బదులుగా సోయా బీన్స్ తీసుకోవడం మంచిది. చాలామంది బంగాళదుంపలను తిన్న వెంటనే ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటారు.

అలాంటివారు బంగాళదుంపలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒకవేళ తినాలి అనుకునేవారు బంగాళాదుంప కూరలో తక్కువ మసాలాను ఉపయోగించాలి. ముఖ్యంగా బయట దొరికే చిప్స్ మరియు ఆలూ-పరోటా వంటి నూనెలో వేయించిన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే నడుము నొప్పి ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు ఈ బంగాళదుంపతో చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే బంగాళదుంప శరీరంలో నొప్పులను మరింత ఎక్కువ అయ్యేలా చేస్తుంది. కాబట్టి నొప్పుల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.

Author