Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమా కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ కాల్షీట్లు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా ఏళ్ల పాటు దేవర కోసం మాత్రమే పని చేస్తున్నారు. అయితే.. దేవర సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. ఆ మూవీ రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా గురించి టాలీవుడ్ సర్కిల్ లో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తుండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అయ్యారు. మరి ఆ తర్వాత జూనియర్ నటించబోయే సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే.. ఎన్టీఆర్ తో యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ సినిమా తీస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దానిపై తాజాగా శౌర్యువ్ క్లారిటీ ఇచ్చాడు.
అసలు తాను జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయడం లేదని.. అదంతా రూమర్ అని క్లారిటీ ఇచ్చాడు. అది రూమర్ అయినప్పటికీ.. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయడం మాత్రం తన కల అని.. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా అని స్పష్టం చేశాడు. ఇక.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్.