YS Jaganmohan Reddy : వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తాజాగా పులివెందుల పర్యటన గురించి తెలిసిందే. తనను ఎమ్మెల్యేగా గెలిపించీ ప్రజలను కలిసేందుకు జగన్ పులివెందుల కదిలారు. ఐతే ఓడినా సరే సొంత నియోజకవర్గం కాబట్టి పులివెందుల జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర జనాల సందడి బాగా ఉంది. అది చూసిన పార్టీ నేతలకు కాస్త హుశారు వచ్చింది. 2024 ఏపీ ప్రజల తీర్పు జనాలు తమని ఎంతగా అసహ్యించుకుంటున్నారో తేలిపోగా తాజాగా పులివెందుల ఆఫీస్ లో తమ పార్టీ కేడర్ ని చూసి పార్టీ నేతల మనసు కాత కుదుట పడ్డది.
ఇక వచ్చాం కదా అని జగన్ అక్కడ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మా ఎమ్మెల్యే అని కాదు మాజీ సీఎం అన్న ఆలోచనతో తమకున్న సమస్యలను జగన్ తో చెప్పుకున్నారు పులివెందుల జనాలు. జగన్ నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ చూసి జగన్ పాలించిన ఈ ఐదేళ్లలో ఇలా ఎప్పుడు చేయలేదు కదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు జనాల గురించి ఆలోచించలేదు కాబట్టే జనాల నుంచి ఈ విధమైన తిరస్కరణ వచ్చింది.
సీఎం గా పులివెందుల వచ్చాడు వెళ్లాడు అనే ముచ్చట తప్ప ఇలా ప్రజలను కలిసి వారి సమస్యల గురించి గత ఐదేళ్లలో ఏనాడూ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం లేకపోయే సరికి ప్రజల దగ్గరకు తానే వచ్చి వారితో కలిసి మాట్లాడుతున్నారు. ఇది చూసిన వైసీపీ నేతలంతా కూడా ఇదేదో ఐదేళ్లుగా చేసి ఉంటే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయేది కాదని అనుకుంటున్నారు.
అంతేకాదు జగన్ ప్రజల కోసం వెళ్లడం కాదు ప్రజలే జగన్ కోసం వేచి చూస్తున్నారని అనుకుంటున్నారు. పులివెందుల ప్రజల నుంచి వచ్చిన ఈ ఆదరణ చూసిన తర్వాత వైఎస్ జగన్ ఏపీ మొత్తం తిర్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. మరి జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ పులివెందుల ప్రజా దర్బార్ మాత్రం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తెచ్చిందని చెప్పొచ్చు.