AP Free Bus : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మహిళలతో పాటు వాళ్లకు కూడా ఉచిత ప్రయాణం

AP Free Bus : ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన కసరత్తు చేస్తోంది. నిజానికి.. మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలోనూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కేవలం మహిళలకు మాత్రమే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నాయి.

ap free bus travel to health pensioners also

కానీ.. ఏపీలో మాత్రం మహిళలకే కాకుండా మరికొందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా.. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బస్సు ప్రయాణానికి సంబంధించి పలు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలతో పాటు అనారోగ్యంతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వాళ్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, పక్షవాతం, లివర్ లాంటి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అనారోగ్యాలతో ఉన్నవాళ్లలో ఏపీలో 50 వేల మందికి పైనే ఉన్నారు. వాళ్లకు ఏపీ ప్రభుత్వం పింఛన్ కూడా ఇస్తోంది. ఈనేపథ్యంలో వాళ్ల చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగే సమయంలో ప్రయాణాలకు ఎక్కువ ఖర్చులు అవుతుండటం వల్ల.. వాళ్లకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేలా ప్రణాళికలను ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

Author