Ys Sharmila : వైఎస్ జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుపడేది బాబు కాదు షర్మిలానేనా..?

Ys Sharmila : వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గా మారింది. తనకు ఇచ్చిన అధికారాన్ని తనకు నచ్చినట్టుగా పాలించిన వైఎస్ జగన్ కు ఈసారి ఆంధ్రా ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. లాస్ట్ టైం 150 ప్లస్ సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పడిపోయింది అంటే ఇది మామూలు పరాజయం కాదు. ఐతే ఈసారి ఆంధ్రా ఓటర్లు బాబుని సీఎం చేయడం కోసం నడుంబిగించారు. ఎక్కడ వైఎస్ జగన్ కి ఛాన్స్ ఇవ్వలేదు.

Advertisement
Ys Sharmila : వైఎస్ జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుపడేది బాబు కాదు షర్మిలానేనా..?
Ys Sharmila : వైఎస్ జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుపడేది బాబు కాదు షర్మిలానేనా..?

చంద్రబాబు కూడా జగన్ ని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ఐతే వైఎస్ జగన్ ని అధికారంలోకి రాకుండా అడ్డు పడింది ఇక మీదట కూడా అడ్డుగా నిలిచేది బాబు కన్నా ముందు ఆయన సోదరి వైఎస్ షర్మిలానే అని అంటున్నారు. మొన్నటిదాకా ఆమె కేవలం వైఎస్ జగన్ చెల్లి కానీ ఇప్పుడు ఆమె ఏపీ పీసీసీ చీఫ్.. జరిగిన ఎలక్షన్స్ లో వైసీపీ పతనానికి షర్మిక కూడా ఒక కారణమని తెలుస్తుంది.

Advertisement

అంతేకాదు రాబోయే రోజుల్లో వైసీపీకి కాంగ్రెస్ నుంచి పెద్ద షాకులే తగిలేలా షర్మిల ప్లాన్ చేస్తుందని టాక్. కాంగ్రెస్ అధిష్టానం కూడా పక్కా ప్లానింగ్ తో ఏపీలో షర్మిలను రంగంలోకి దించింది. 2024 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఐదు శాతం ఓట్లు పడ్డాయి. అవన్ని వైసీపీకి పడాల్సిన ఓట్లే. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వైసీపీ ఓట్లనే చీలేలా చేసింది. కేవలం ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఎన్నికైంది.

అదే ఐదేళ్లు ఉంటే కచ్చితంగా వైసీపీకి పెద్ద మైనస్ గా మారేది. ఇప్పటికే వైసీపీ అసంతృప్తి సభ్యులు కొందరు కాంగ్రెస్ లోకి చేరుతారని టాక్. సో ఎటు చూసినా అటు చంద్రబాబు నుంచే కాదు సోదరి షర్మిల నుంచి కూడా జగన్ కి చాలెంజ్ రాబోతుంది. మరి వీటిని వైసీపీ ఎలా తిప్పి కొడుతుంది అన్నది చూడాలి. అంతేకాదు గత పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ ఊసే లేదు. 2024 లో కాంగ్రెస్ కు 4 నుంచి 5 శాతం వరకు వచ్చాయి. 2029 లో వాటిని మరింత పెంచేలా చూస్తున్నారు.

Author