Harbhajan Singh : తౌబా తౌబా పాట వివాదం.. క్షమాపణలు చెప్పిన హర్భజన్ సింగ్

Harbhajan Singh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తౌబా తాబా పాట గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మూవీ బ్యాడ్ న్యూస్ లో ఈ పాట ఉంది. ఆ పాటలో ఒక హుక్ స్టెప్ ఉంది. విక్కీ కౌశల్ వేసిన ఆ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని నెటిజన్లు కూడా ఒంటపట్టించుకొని తెగ రీల్స్ చేస్తున్నారు. చివరకు సెలబ్రిటీలు కూడా ఈ హుక్ స్టెప్పును వేసి అలరిస్తున్నారు.

Harbhajan and Yuvraj trolls on social media on tauba tauba song

ఈ పాటకు క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా ముగ్గురూ కలిసి రీల్ చేశారు. హుక్ స్టెప్పు వేశారు. అంతే కాదు.. క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత మా బాడీ కూడా ఇలా తౌబా తాబా అయ్యాయంటూ క్యాప్షన్ పెట్టారు. అంతే కాదు.. విక్కీ కౌశల్ ను కూడా ఆ వీడియోలో ట్యాగ్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఇది దివ్యాంగులను కించపరిచినట్టుగా ఉందంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు.

దీంతో ఆ పాటపై మాజీ క్రికెటర్ హర్భజన్ క్షమాపణలు చెప్పారు. తాము ఎవ్వరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదన్నారు. ఇతరులను కించపరచడం తమ ఉద్దేశం కాదన్నారు. సాధారణంగా ఎక్కువ రోజులు క్రికెట్ ఆడితే తమ శరీరాలు ఎలా మారుతాయో చెప్పడమే తమ ఉద్దేశం అని క్లారిటీ ఇచ్చాడు హర్భజన్ సింగ్.

Author