BRS : బీఆర్ఎస్‌కి మరో దెబ్బ.. కాంగ్రెస్‌లోకి ఇంకో ఎమ్మెల్యే.. షాక్‌లో కేసీఆర్

BRS : బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ పరిస్థితులు అన్నీ తలకిందులుగా అయ్యాయి. పార్టీ కేడర్ మొత్తం డిస్టర్బ్ అయింది. పార్టీకి చెందిన కీలక నేతలంతా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కేసీఆర్, కేటీఆర్ సతమతమవుతున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారో అని టెన్షన్ పడుతున్నారు.

Advertisement

brs mla arikepudi Gandhi joins in congress

Advertisement

నిన్ననే బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన చేరి ఒక్క రోజు కూడా కాలేదు. ఇంతలోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీ.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. గాంధీకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గాంధీతో పాటు ఎమ్మెల్యే అనుచరులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

BRS : ఇప్పటి వరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్

గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు 9 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దీనికి నాంది పలకగా.. ఇప్పటి వరకు 9 మంది కాంగ్రెస్ లో చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు.

Author