Big Breaking : Arvind Kejriwal కి బెయిల్.. ఆప్ పార్టీ సంబురాలు

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించిందది. సుప్రీం కోర్టు ఆయన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. ఎట్టకేలకు సుప్రీంలో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. కాకపోతే షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది.

Advertisement

Arvind Kejriwal gets interim bail

Advertisement

లిక్కర్ స్కాం కేసులో అర్వింద్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యారు. ఆమె ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు. ఇక.. అర్వింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసు విచారణను సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెల్లడించింది.

తన అరెస్ట్ అక్రమం అని.. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తూ ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారని.. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది.

Author