Skin Care : ఈ చిట్కాలు పాటిస్తే చాలు… వానా కాలంలో వచ్చే చర్మ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

Skin Care : వర్షాకాలం రానే వచ్చేసింది. గాలిలో తేమ అనేది అధికంగా ఉంటుంది. అయితే మనం నీటిలో ఎక్కువగా పాదాలను తడుపుతూ ఉంటాము. దీని కారణంగా ఎన్నో చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యంగా కాళ్ల వేల సందులలో దద్దుర్లు మరియు ఎర్రబడటం, పొట్టు పొట్టు రాలిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సహజమైన పద్ధతుల వలన ఉపసమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మామూలుగా వేడి నీళ్లలో ఉప్పు వేసి,డెటాల్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన బ్యాక్టీరియా అనేది నశిస్తుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దగ్గరకు రాకుండా ఉంటాయని అంటున్నారు…

Advertisement

వీటితో పాటుగా పెట్రోలియం జెల్లీలు కూడా రాసుకొని కొద్దిసేపు మర్ధనా చేయడం వలన డ్రై స్కిన్ కూడా సాఫ్ట్ గా మారే అవకాశం ఉంటుంది. కావున క్రమంగా దురద అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే పెప్పర్ మెంట్ నూనె పూయటం వలన కూడా దద్దుర్లు మంట అనేవి తగ్గుముఖం పడతాయి. అంతేకాక గోరువెచ్చని నీటిలో రెండు లేక మూడు చెంచాల పెప్పర్ మెంట్ నూనెను వేసి బాగా కలపాలి. అలాగే పాదాలు మునిగే వరకు పది నిమిషాల పాటు ఉంచాలి. దాని తర్వాత బయటకు తీసి పొడి బట్టతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. అంతేకాక బేకింగ్ సోడా,హైడ్రోజన్ పెరాక్సైడ్, పుదీనా రసం కూడా వాడుకోవచ్చు.

Advertisement

అయితే చర్మ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పొక్కులు అనేవి ఏర్పడి పెద్ద నష్టం వాటిల్లుతుంది అని వైద్యులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి వర్షాకాలంలో ఎక్కువసేపు సాక్సులు అనేవి ధరించకుండా ఉండటమే మంచిది అని అంటున్నారు వైద్యులు. అలాగే పాదాలకు గాలి అనేది తగులుతూ ఉండేలా చూసుకోవాలి అని అంటున్నారు నిపుణులు…

Author