Nitish kumar Reddy : టీమిండియాని ఫ్యూచ‌ర్‌లో ఏలేది నితీష్ కుమార్ రెడ్డి.. హార్ధిక్‌కి పెద్ద ఎస‌రు పెట్టేలా ఉన్నాడు..!

Nitish kumar Reddy : ఐపీఎల్ IPL 2024 మ్యాచ్‌ల‌తో అనేక ఆణిముత్యాలు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. మ‌న తెలుగు కుర్రాళ్లు కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఇప్ప‌టికే తిల‌క్ వ‌ర్మ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకోగా, ఇప్పుడు మ‌రో తెలుగు Telugu కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఇటీవ‌ల ఐపీఎల్ 2024లో హైదరాబాద్ వేదికగా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మ్యాచ్ ఒకటి జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ sunrisers hyderabad ఒక్క పరుగు తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రాజ‌స్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించారు. తెలుగు కుర్రాడు తన బ్యాటింగ్, బౌలింగ్‌తో దేశం మొత్తాన్ని ఊపేశాడు.

Advertisement
Nitish kumar Reddy : టీమిండియాని ఫ్యూచ‌ర్‌లో ఏలేది నితీష్ కుమార్ రెడ్డి.. హార్ధిక్‌కి పెద్ద ఎస‌రు పెట్టేలా ఉన్నాడు..!
Nitish kumar Reddy : టీమిండియాని ఫ్యూచ‌ర్‌లో ఏలేది నితీష్ కుమార్ రెడ్డి.. హార్ధిక్‌కి పెద్ద ఎస‌రు పెట్టేలా ఉన్నాడు..!

Nitish kumar Reddy : వైజాగ్ కుర్రాడు అద‌ర‌హో..

ఈ వైజాగ్ కుర్రాడు రాజస్తాన్ రాయల్స్‌ rajasthan royals బౌలర్లను ఊచకోత కోసాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు . నితీష్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. గతేడాది కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నితీష్ రెడ్డికి త‌న టాలెంట్ చూపించే అవ‌కాశం రాలేదు. కాని ఈ సీజ‌న్‌లో ప్యాట్ క‌మిన్స్ మ‌నోడి స‌త్తా చూసి బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపించాడు. దీంతో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడిన నితీష్ కుమార్ రెడ్డి… గత రంజీ ట్రోఫీలో మొత్తం 366 పరుగులు చేసి, 25 వికెట్లు తీశాడు. కాగా, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు.

Advertisement
Nitish kumar Reddy : టీమిండియాని ఫ్యూచ‌ర్‌లో ఏలేది నితీష్ కుమార్ రెడ్డి.. హార్ధిక్‌కి పెద్ద ఎస‌రు పెట్టేలా ఉన్నాడు..!
Nitish kumar Reddy : టీమిండియాని ఫ్యూచ‌ర్‌లో ఏలేది నితీష్ కుమార్ రెడ్డి.. హార్ధిక్‌కి పెద్ద ఎస‌రు పెట్టేలా ఉన్నాడు..!

హార్ధిక్ hardik pandya కి ఇతను రీప్లేస్‌మెంట్ అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ముందు ముందు మ్యాచుల్లో కూడా ఇలానే సత్తా చాటాలని తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ రౌండ్ స్కిల్స్ ఉన్న ఆటగాళ్లకు టీమిండియాలో మంచి డిమాండ్ ఉంటుంది కాబ‌ట్టి అత‌డు టీమిండియాలో త‌ప్ప‌క స్థానం సంపాదించుకుంటాడ‌ని, ఫ్యూచ‌ర్ స్టార్‌గా కూడా మార‌తాడ‌ని కొంద‌రు క్రీడా పండితులు చెప్పుకొస్తున్నారు

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts