Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు నెలల్లో ఎవరు అడ్డుపడిన కన్యారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 2023 నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి ఊహించని ధన ఐశ్వర్య, ఆరోగ్య అదృష్ట ఫలితాలు ఉంటాయి. మరి ఈ రాశికి జరగబోయే పది ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం.
కన్యా రాశి వారు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తో ఒకటి రెండు పాదాల్లో వారు జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలరు.. ఈ రాశి వారు అన్ని రంగాలలో రాణించగలుగుతారు.ఇది రాశి వారి ముఖ్య లక్షణం. ప్రతిదాన్ని అనుమానించడం గా చెప్పుకోవచ్చు.
ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. ప్రతి పనిలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఖర్చులు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా నడుస్తాయి. విజయాలు పొందుతారు. ఇతరులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్థితిలు ఉంటాయి.