Vitamin B12 : విటమిన్ బి12 లోపం ఉంటే… కనిపించే ముఖ్యమైన లక్షణాలివే…!

Vitamin B12 : మీకు ఎప్పుడు అలసట, మైకము, ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుందా. అయితే ఇది తప్పనిసరిగా పోషకాహార లోపం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం ఎంతో మందిలో ఈ విటమిన్ బి 12 లోపం అనేది కనిపిస్తూ ఉంది. బి 12 విటమిన్ అనేది సహజంగా లభించదు. చేపలు, మాంసం, గుడ్లు, పాలలో విటమిన్ బి 12 అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే విటమిన్ బి 12 ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ అనేది నీటిలో కరుగుతుంది. ఇది ఇతర శారీరక విధుల్లో ముఖ్య పాత్ర కూడా వహిస్తుంది. ఎర్ర రక్త కణాల నిర్మాణం మరియు నరాల పనితీరు, DNA సంశ్లేషణకు చాలా అవసరం. విటమిన్ బి12 లోపంలో ఒక సాధారణమైన లక్షణం శక్తి అనేది లేకపోవడం, స్థిరమైన అలసట. ఇది మన రోజు వారి కార్యకలాపాలు మరియు ఉత్పాదకత మొత్తం జీవన నాణ్యతను కూడా ఎంతో ప్రభావితం చేయగలదు. విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వీటిని మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

Vitamin B12 : విటమిన్ బి12 లోపం ఉంటే... కనిపించే ముఖ్యమైన లక్షణాలివే...!
Vitamin B12 : విటమిన్ బి12 లోపం ఉంటే… కనిపించే ముఖ్యమైన లక్షణాలివే…!

విటమిన్ బి12 లోపం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది తగ్గి రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత ఉన్నటువంటి వ్యక్తులకు చర్మం అనేది పసుపు రంగులోకి మారుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే. ఎర్ర రక్త కణాలు మరియు చర్మం ఎంతో ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి కాబట్టి. విటమిన్ బి 12 లోపం ఉన్నట్లయితే ముఖ్యంగా మన శరీరంలో కొన్ని లక్షణాలు అనేవి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపం వలన గుండె దడ మరియు ఒత్తిడి లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్మం అనేది పాలిపోయినట్లుగా కూడా అనిపిస్తుంది. విటమిన్ బి 12 లోపం వలన శ్వాస తీసుకోవటంలో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే. ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని తగ్గిస్తుంది కాబట్టి. శరీరం ఆక్సిజన్ వాహాక సామర్థ్యానికి కూడా ఎంతో ప్రభావితం చేయగలదు. విటమిన్ బి12 లోపం వలన రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. తల తిరగటం అప్పుడప్పుడు తలనొప్పి లాంటివి కూడా వస్తూ ఉంటాయి. గ్లోసిటీస్ అనేది నాలుక వాపు. దీని కారణాలు అలర్జీ, ప్రతి చర్యలు, ఇన్ఫెక్షన్లు, నోరు పొడిబారడం లాంటివి. ఇది అనేది విటమిన్ బి 12 లోపం మొదటి లక్షణం..

విటమిన్ బి 12 లోపం ఇతర లక్షణాలు అతిసారం, మలబద్ధకం, ఆకలి లేకపోవడం లాంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. నాడీ వ్యవస్థకు సరియైన పనితీరుకు విటమిన్ బి 12 ఎంతో అవసరం. విటమిన్ బి 12 లోపం వలన ఏకాగ్రత తగ్గటం, జ్ఞాపకశక్తి తగ్గటం, తెలివితేటలు తగ్గటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది డిప్రెషన్, చిరాకు, మూడు స్వింగ్ లకు కూడా దారి తీయొచ్చు. విటమిన్ బి 12 లోపం గుండె సమస్యలను పెంచే అవకాశం కూడా ఉన్నది. ఎందుకు అంటే. ఇది రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను కూడా ప్రభావితం చేయగలదు. ఇది హృదయ నాళ ఆరోగ్యానికి సంబంధించింది కూడా…

Author