Ashada Bonalu 2024 : ఈరోజే గోల్కొండ బోనాలు.. ఆషాఢ బోనాలు ప్రారంభం.. ఎల్లమ్మకు తొలి బోనం

Ashada Bonalu 2024 : తెలంగాణ సంప్రదాయం, తెలంగాణ అసలైన పండుగ అంటే బోనాలు అనే చెప్పుకోవాలి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు పండుగ ప్రతీక. ప్రతి సంవత్సరం జులైలో బోనాలు స్టార్ట్ అవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా బోనాల ప్రారంభానికి తొలి అడుగు ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో పడుతుంది. ఈ సంవత్సరం బోనాలకు తొలి అడుగు జులై 7న అంటే ఈరోజు పడనుంది. ఆషాడ మాస బోనాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం అవుతాయి.

ashada bonalu 2024 to start from July 7

గోల్కొండ కోటలో ఉన్న జగదాంబకి మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రజలు తొలి బోనం సమర్పించనున్నారు. దీంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బోనాల పండుగ 9 వారాల పాటు సాగనుంది. ప్రతి వారం ఒక్కో అమ్మవారి దగ్గర బోనాలను అంగరంగ వైభవంగా జరుపుతారు.

Ashada Bonalu 2024 : మళ్లీ గోల్కొండ కోటతోనే ముగియనున్న బోనాల పండుగ

9 వారాల పాటు అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత మళ్లీ గోల్కొండ కోటలోనే బోనాలు ముగియనున్నాయి. గోల్కొండ బోనాలు లంగర్ హౌస్ నుంచి ప్రారంభం అవుతాయి. అక్కడి నుంచి ఊరేగింపుతో గోల్కొండ కోటకు బోనాలు చేరుతాయి. గోల్కొండ వద్దకు బోనాలు రాగానే అమ్మవారిని అలంకరించి.. అక్కడి నుంచి కోటపైన ఉన్న గుడి వద్దకు ఊరేగింపుతో తీసుకెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం ఆషాడ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. ముత్యాలమ్మ, మాంకాలమ్మలకు ప్రజలు బోనాలు సమర్పిస్తారు.

Author