Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి వారికి ఏదో ఒక రూపంలో తప్పకుండా మహాభాగ్య యోగం అనేది పడుతుంది. ఇక ఈ సమయంలో ఈ రాశుల వారికి అన్ని విధాలుగా పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి ముఖ్యంగా విదేశీ యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం గ్రహ సంచారం రీత్యా భాగ్యాధిపతి కారణంగా మేష వృషభ మిధున కర్కాటక తుల మరియు మకర రాశి వారికి అనుకూలంగా మారనుంది. ..తద్వారా వీరికి అదృష్ట యోగాలు పట్టడంతో పాటు శుభవార్తలు కూడా వింటారు..

Advertisement
Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం... ఇకపై అన్ని శుభయోగాలే...!
Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs మేషరాశి

మేషరాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వలన వీరికిి అపార ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలన్నీ కూడా సత్ఫలితాలను అందిస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం వీరికి ఉంటుంది. 2025 మే వరకు ఈ రాశి వారికి ధన సంబంధమైన అదృష్ట ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి…….

Advertisement
Advertisement
ఇది కూడాచ‌దండి :  RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

Zodiac Signs వృషభ రాశి

వృషభ రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు దశమ స్థానంలో ఉండటం వలన వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో పురోగతి సాధిస్తారు. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి 2025 జూలై వరకు అదృష్టం కొనసాగుతుంది.

Zodiac Signs మిధున రాశి

ప్రస్తుతం ఈ రాశి వారికి భాగ్య స్థానాధిపతి శని భాగ్య స్థానంలో సంచారం చేయడం వలన 2025 జూలై వరకు వీరు ఆర్థికంగా ఎదుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ముందుంటారు. అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉంటుంది.

ఇది కూడాచ‌దండి :  AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

కర్కాటక రాశి.

కర్కాటక రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభ స్థానంలో ఉండడం వలన వీరికి 2025 మే వరకు అన్ని విధాలుగా ధన యోగాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో వ్యాపారాలలో లాభపరంగా ముందుకు సాగుతారు. అనేక మార్గాలలో ఆదాయం వచ్చి పడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

తులారాశి…

ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ మరియు లాభ స్థానాలలో సంచారం చేస్తుండడం వలన ఈ ఏడాది సెప్టెంబర్ 23 వీరికి ఏదో ఒక విధంగా ధన యోగం పడుతుంది. వ్యాపారాలలో లాభాలు అంచనాలను మించుతాయి.

మకర రాశి…

ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు దాదాపు నాలుగు నెలల పాటు అనుకూల స్థానంలో సంచారం చేయనున్నాడు. దీంతో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా ముందుకు పోతాయి.

Author