Ships : తాజాగా అమెరికాలోని ఓ ఓడరేవు ప్రాంతంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అమెరికాలోని బాల్టిమోర్ ఓడరేవు సమీపంలో డాలి అనే ఓ భారీ నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్ కార్డ్ బ్రిడ్జి కూలడం జరిగింది. ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలి పటాస్కో అనే నదిలో పడిపోవడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. అయితే వాస్తవానికి నౌకలో సిబ్బంది ముందుగా హెచ్చరించడంతో బ్రిడ్జిపై రాకపోకలని నిలిపివేశారు. దీంతో భారీ ప్రాణా నష్టం తప్పిందని చెప్పాలి. అయితే సముద్రంలో ప్రయాణిస్తున్న నౌక లో సాంకేతిక లోపం తలెత్తిందని ముందుగానే గుర్తించిన యాజమాన్యం ఓడను నియంత్రించలేకపోయారు. దీంతో అసలు ఓడ ఎలా ఢీ కొట్టింది…సముద్రంలో ప్రయాణించే ఓడలకు బ్రేకులు ఉంటాయా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో మొదలయ్యాయి. అయితే వాస్తవానికి సముద్రంలో ప్రయాణించే నౌకలకు , ఓడలకు బ్రేక్స్ అనేవి ఉండవు. మరి గంటకు 30 , 40 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకు వచ్చే షిప్ లు ఒడ్డుకు వచ్చేటప్పుడు వేగాన్ని ఎలా నియంత్రిస్తాయి అనే సందేహం అందరిలో వస్తుంది. మరి దీని గురించి పూర్తి సమాచారం ఒకసారి తెలుసుకుందాం…
షిప్ లకు బ్రేకులు ఉంటాయా…?
వాస్తవానికి సముద్రంలో ప్రయాణించే ఓడలకు బ్రేకులైతే ఉండవు. కానీ వాటిని నియంత్రించడానికి బ్రేకులు ఎలా వేస్తారో తెలియాలంటే ముందుగా అది ఎలా కదులుతుందని తెలుసుకోవాలి.అయితే రోడ్లమీద ప్రయాణించే ప్రతి వాహనానికి బ్రేక్స్ ఉంటాయి. వాహనాన్ని నియంత్రించేందుకు బ్రేక్స్ నొక్కగానే టైరు మరియు రోడ్డు మధ్య ఘర్షణ వలన వాహనం ఆగిపోతుంది. కానీ సముద్రపు నీటిలో ఈ ఘర్షణ అనేది చాలా అత్యల్పంగా ఉంటుంది కాబట్టి బ్రేకులు వేయడం కష్టం.ఈ క్రమంలోనే 289 మీటర్లు పొడుగున్న డాలి అనే రవాణా నౌక తాజాగా బాల్టిమోర్ ఓడరేవు నుంచి మార్చి 26 రాత్రి శ్రీలంకకు బయలుదేరడం జరిగింది. అయితే ఆ నౌక బయలుదేరిన కొద్దిసేపటికి దానిలో విద్యుత్ సరఫరా మొత్తం నిలిచిపోయింది. దీంతో అత్యవసర జనరేటర్లు ఆన్ చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. దీంతో నౌక పూర్తిగా నియంత్రణ కోల్పోయి బ్రిడ్జిని ఢీ కొట్టింది. నౌక తాకిడికి తట్టుకోలేని బ్రిడ్జి కూలిపోయింది.
Ships : అసలు నౌక ఎలా ప్రయాణిస్తుంది…
సముద్రంలో ప్రయాణించే నౌకలు చాలా రకాలు ఉంటాయి. వీటి నిర్మాణం ఎలా ఉన్నప్పటికీ సముద్రంలో ప్రయాణించడానికి వెనుక ఉన్న ప్రొపేలర్ పైనే ఆధారపడతాయి. ఇక ఈ ప్రొఫెలర్ తిరుగుతున్నప్పుడు ముందుగా నీటిని వెనక్కి నెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ న్యూటన్ సూత్రం ప్రకారం…చర్యకు ప్రతిచర్య కారణంగా ఓడ ముందుకు కదులుతుంది. అయితే ఓడ కదిలేందుకు ప్రొపేలర్ తిప్పేందుకు భారీ జనరేటర్లను ఉపయోగిస్తుంటారు. ఇక ఈ ప్రొపేలర్ తిరిగే వేగం పైనే ఓడ ప్రయాణించే వేగం ఆధారపడి ఉంటుంది. ఇక షిప్ దిశ మార్చడానికి ప్రొపెలర్ వెనుక ఉండే రెడ్డర్ అనే దానిని ఉపయోగిస్తారు.
ఇక దీనిని నీటిలో కుడివైపుకి తిప్పినట్లయితే పడవ ఎడమవైపు కదులుతుంది. ఎడమవైపుకు తిప్పితే కుడివైపుకు కదులుతుంది. ఈ విధంగా నౌక యొక్క దిశ మారుస్తుంటారు. అయితే భూమిపై వాహనాలు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లుగా సముద్ర మార్గంలో ఓడలు అంత వేగంగా ప్రయాణించలేవు. సముద్ర జలాల్లో షిప్ లు కేవలం గంటకు 30 నాడ్స్ వేగంతో ప్రయాణించగలుగుతాయి.అంటే భూమిపై దాదాపు 56 కిలోమీటర్ల వేగం అన్నమాట. అయితే భూమిపై తిరిగే వాహనాలకు బ్రేకులేస్తే తక్కువ దూరంలోనే ఆగుతాయి. కానీ సముద్రంలో ప్రయాణించే షిప్ లు తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ వాటిని పూర్తిగా ఆపాలంటే చాలా కష్టం. ఎంత ప్రయత్నించినప్పటికీ చాలా దూరం ముందుకు ప్రయాణించిన తర్వాతే వాటిని ఆపటం సాధ్యమవుతుంది.
Ships : అయితే షిఫ్ లను సముద్రంలో ఎలా ఆపుతారు…
అయితే సముద్ర జలాల్లో నౌకలను స్థిరంగా నిలిపేందుకు యాంకర్లను వాడుతారు. దీనిని లంగర్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ లంగర్ ని సముద్రం మధ్యలో లోతు ఎక్కువగా ఉన్న చోట వేయడం సాధ్యపడదు. కావున తీరానికి దగ్గరగా షిప్ తీసుకువచ్చి లంగర్ కిందకు వేస్తారు. దీనికోసం ముందుగా షిప్ కింద నేల ఎంత లోతులో ఉంది అనేది తెలుసుకుంటారు. అనంతరం లంగర్ కిందకు దింపుతారు. అయితే ఈ లంగర్ కిందకి దింపడానికి విద్యుత్ అవసరం లేదు. లంగర్ బరువు కారణంగా స్వయంగా అవి సముద్రం అడుగుకు వెళ్తాయి. ఆ తర్వాత నేలను తాకి సముద్ర గర్భాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాయి. దీని కారణంగా షిప్ సముద్రంలో స్థిరంగా ఉండగలుగుతుంది.