Dead Body : మన హిందూ ధర్మం లో పుట్టుక నుండి చావు వరకు 16 సంస్కారాలు ఉన్నాయని మీకు తెలుసా.? వీటిని షోడశ సంస్కారాలు అంటారు. వీటిలో చివరిది దహన సంస్కారం. ఇది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యుల ద్వారా నిర్వహించబడుతుంది. ఆత్మకు మోక్షాన్ని కలిగించేందుకు ఈ సంస్కారంలో అనేక నియమాలను పాటిస్తారు. ఈ నియమాలు చూడటానికి వినటానికి కాస్త విచిత్రంగానే ఉంటాయి. అందుకే వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. దహన సంస్కారం ఎలా చేయాలి అనే నియమాలు గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నాయి. ఇప్పటి తరం వారు ఈ నియమాల వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవాలి అనుకోవట్లేదు. దహన సంస్కారంలోని నియమాల గురించి వింతైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం.. అలానే ఇవి అమలు చేయడం ఎలుక ఉన్న ఆధ్యాత్మిక వైజ్ఞానిక కారణాలు కూడా వివరించబోతున్నాం..
Dead Body చితిని అంటించే ముందు కుండ లో నీటిని ఎందుకు నేల మీద పడేస్తారు
మరణించిన వ్యక్తి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కుండలో ఏం పట్టుకెళ్తారు.. దీనికి పెళ్లి సమయంలో చేసుకునే ప్రతిజ్ఞలకు సంబంధమేమిటి.? చితిని అంటించే ముందు కుండ లో నీటిని ఎందుకు నేల మీద పడేసి పగలగొడతారు. తగలబడుతున్న శవం తల మీద కర్రతో ఎందుకు కొడతారు.? శవాన్ని స్మశానానికి తీసుకువెళ్లే సమయంలో నాణ్యాలు పువ్వులు మరియు తామర గింజలు ఎందుకు చల్లుకుంటూ వెళ్తారు. శవయాత్ర చూసిన తర్వాత ఏం చేస్తే మీ పాపకర్మలు తొలగిపోతాయి. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత స్మశానానికి వెళ్లేటప్పుడు మూడు దారాలు కట్టి దానిలో కుండను పెట్టి దానీ నిండా నీటిని నింపి శవం ముందు కొడుకు లు పట్టుకుని వెళ్తూ ఉంటారు. స్మశానం చేరాక ఈ కుండలోని అగ్ని కట్టే మీద పెట్టి మంట చేస్తారు. ఈ మంటతోనే మృతిని దహన సంస్కారాలు చేస్తారు. అంటే మృతదేహాన్ని కాలుస్తారు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. వారు జీవితాంతం గడపబోయే ఇంటిలో మంత్రం ద్వారా స్థాపితం చేస్తారు. అలాగే అగ్నిని హోమాలకు యజ్ఞాలకు పూజలకు ఉపయోగిస్తారు.
అంత పవిత్రమైంది అగ్ని. ఈ పవిత్రతకు గౌరవం ఇస్తూనే మనం ఇంటి నుండి కుండలోనీటితో పాటు అగ్నిని ఇంటి నుంచి స్మశానానికి తీసుకువెళ్తాం. శవాన్ని చితి మీద ఉంచాక.. కొడుకు లేదా కుటుంబంలో ఒకరు కుండలో నీరు తీసుకొని ప్రదక్షిణ చేస్తూ కుండకు కి రంధ్రం పెడుతూ ఉంటారు. ఆ రంద్రం ద్వార నీరు పడుతూ ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం. కుండ నుంచి నీరు ఎలా కారిపోతుందో అదే విధంగా మనిషి జీవనం కూడా ఏదో ఒక రోజు అర్థం అయిపోతుంది. ప్రాణం లేని శరీరం ప్రకృతిలో కలిసిపోతుంది అని తెలిపేందుకు కుండను పగలగొడతారు. అలాగే చనిపోయిన వారికి బంధాలు తొలగి మోక్షం వైపు వెళ్ళగలరు. గట్టిగా కొట్టడం దీనిని కపాలక్రియ అని అంటారు. ఈ క్రమంలోని కర్పూరం ఉపయోగించి దేహాన్ని పూర్తిగా కాల్చే ప్రయత్నం చేస్తారు. అయితే దేహమంతా కాలిపోయిన తల అనేది కాలకుండా లేదా సగం ఖాళీ మిగిలిపోతుంది. ఇలాంటి జరగకుండా ఉండేందుకు తలను కర్రతో పగలగొడతారు.అప్పుడు శవం పూర్తిగా తగలబడుతుంది. అంటే భవిష్యత్తులో శుభం కలుగుతుంది. దీనివల్ల పుణ్యం పెరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది. అలాగే శవాన్ని మోయటానికి ఎవరైతే ముందుకు వస్తారో వారికి ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి శివయాత్రను చూస్తే అశుభమని భావించకుండా మర్యాదపూర్వకంగా నమస్కరించండి…