Chiranjeevi : ఆ రోజు నేను జ‌గ‌న్‌కు దండం పెట్ట‌డం మ‌హేష్‌కు, ప్ర‌భాస్‌కు ఇష్టం లేదు.. కిషన్ రెడ్డితో చిరంజీవి ఇంటర్వ్యూ వీడియో !

Chiranjeevi  : ఒకరేమో సినీ నటుడుగా ప్రస్థానం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి వ్యక్తిత్వంలో, సేవతత్వంలో ప్రత్యేకత చాటుకోగా… మరొకరేమో విద్యార్థినేతక మొదలై రాజకీయ కార్యకర్తగా మొదలై అంచలంచలుగా ఎదిగి సౌమ్యుడుగా పేరుగాంచి కేంద్ర మంత్రిగా సేవలు అందిస్తున్నారు. అయితే సమాజసేవ పరమాధిగా ముందుకు సాగుతున్న వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి మరొకరు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని చెప్పాలి. సమాజసేవే అంతిమ లక్ష్యంగా పాటుపడుతున్న వీరిద్దరూ ఇటీవల ఒకచోట కలిసి అనేక అంశాల పై చర్చించారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే అత్యుత్తమ అవార్డు అయిన పద్మభూషణ్ అవార్డును ద్రౌపతి మూర్ము చేతుల మీదుగా తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే అత్యున్నత పౌర పుష్కరాన్ని అందుకున్న మెగాస్టార్ కి కిషన్ రెడ్డి అభినందనలు తెలపగా కిషన్ రెడ్డి ఎంపీగా మరోసారి విజయం సాధించాలని కేంద్ర మంత్రిగా సేవలు అందించాలని చిరంజీవి కోరుకున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ కూడా పలు రకాల అంశాలపై చర్చించారు. ఒకరి అనుభవాలను ఒకరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మాట్లాడుతూ తాను మొదటిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు అక్కడి వాతావరణం చూసి షాక్ అయినట్లుగా తెలియజేశారు. శాసనసభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చిరంజీవి పేర్కొన్నారు.

Chiranjeevi : ఆ రోజు నేను జ‌గ‌న్‌కు దండం పెట్ట‌డం మ‌హేష్‌కు, ప్ర‌భాస్‌కు ఇష్టం లేదు.. కిషన్ రెడ్డితో చిరంజీవి ఇంటర్వ్యూ !
Chiranjeevi : ఆ రోజు నేను జ‌గ‌న్‌కు దండం పెట్ట‌డం మ‌హేష్‌కు, ప్ర‌భాస్‌కు ఇష్టం లేదు.. కిషన్ రెడ్డితో చిరంజీవి ఇంటర్వ్యూ !

Chiranjeevi  కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతూ..

అసెంబ్లీలో సమస్యలపై ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని మిమ్మల్ని మాత్రమే చూశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే అసెంబ్లీలో నాకు ఒకపక్క కిషన్ రెడ్డి మరోపక్క జయప్రకాష్ గారుఉండేవారని నాకు తెలిసినంతవరకు అసెంబ్లీలో మీరు దుర్భాషలాడకుండా కేవలం మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడి, ప్రజల సమస్యలపై మాత్రమే మాట్లాడేవారని తెలిపారు. ఒకరకంగా చూసుకుంటే సభా మర్యాదను మీ దగ్గర నుండి నేర్చుకున్నట్లుగా కిషన్ రెడ్డితో చిరంజీవి అన్నారు. ఈ విధంగా చిరంజీవి కిషన్ రెడ్డితో తన అనుభవాలను పంచుకోగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన రాజకీయ అనుభవాలను చిరంజీవితో పంచుకున్నారు. ఆ విధంగా ఇటీవల వీరిద్దరూ మాట్లాడుకున్న ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడాడా చూసేయండి…

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday