Eggs : రోజుకి ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది… అతిగా తింటే అవస్థ తప్పదా…!

Eggs : ప్రతిరోజు గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సైతం చెబుతూ ఉంటారు. అందుకే ప్రస్తుత కాలంలో చాలామంది ప్రతిరోజూ గుడ్లను ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. అయితే ఇలా ప్రతిరోజు గుడ్లు తీసుకోవడం వలన ఏదైనా సమస్య ఉంటుందా.? అసలు ఒక రోజులో ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది…?అతిగా తింటే హాని జరుగుతుందా అని ఆందోళన పడే వారు ఎందరో ఉన్నారు. మరికొందరు ప్రతిరోజు ఎక్కువగా గుడ్లు తింటూ ఉంటారు. మరి ఇలా ప్రతిరోజు గుడ్లు అధికంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement
Eggs రోజుకి ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అతిగా తింటే అవస్థ తప్పదా
Eggs రోజుకి ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అతిగా తింటే అవస్థ తప్పదా

అయితే ఒక రోజులో ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతకంటే ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణాశయంలో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక గుడ్లను ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే ఒకరోజులో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణక్రియ దెబ్బతింటుందని , ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే గుడ్డులో ఎక్కువగా విటమిన్ ఏ, బీ 12 ,డి, ఈ , ఒమేగా 3 వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇన్ని పోషకాలు కలిగి ఉన్న గుడ్డును ఒక రోజుకు ఒకటి లేదా రెండు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంతకంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఇబ్బంది పడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ఇక గుడ్డులో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు కొవ్వులు వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే గుడ్డును పోషకాలు నిధిగా పిలుస్తూ ఉంటారు. ఇన్ని పోషక గుణాలు కలిగి ఉండటం వలనే అధికంగా వర్కౌట్లు చేసేవారు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా సరే రోజుకు ఒకటి రెండు గుడ్లు మాత్రమే తీసుకోవడం మంచిది. అంతేకాదు గుడ్లు తీసుకునేటప్పుడు కొన్ని రకాల నియమాలు కూడా పాటించాలి. ఇక ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ వరకు లభిస్తుంది.

అంతేకాక గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఎలాంటి వయసు వారైనా సరే ఆరోగ్యవంతమైన వారు ప్రతి రోజు ఒక గుడ్డు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాక గుడ్లను ఆమ్లెట్ వేసుకుని తినడం కంటే కూడా ఉడికించుకుని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలునులు కలుగజేస్తుంది.

Eggs  రెండు కంటే ఎక్కువ గుడ్లు తింటే ఏమవుతుంది..?

రోజులో ఒకటి లేదా రెండు గుడ్ల కంటే ఎక్కువ తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక వారం మొత్తంలో 5 లేదా 6 గుడ్లను మాత్రమే తీసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. అంతకంటే ఎక్కువ గుడ్లు తీసుకున్నట్లయితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందట. అంతేకాదు కొలెస్ట్రాల్ కూడా విపరీతంగా పెరగవచ్చు. అందుకే ఒక రోజులో ఒకటి లేదా రెండు గుడ్లు తినడం మంచిది. అలాగే గుడ్డులో ఉండే పచ్చసొన తినకుండా ఉండటం ఇంకా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే గుడ్డులోని పచ్చసొన ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు గుడ్లు తీసుకోవాలి అనుకుంటే ముందుగా వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఇక ప్రతిరోజు వ్యాయామం వర్కౌట్లు చేసేవారు 2 – 3 కంటే ఎక్కువ గుడ్లు తినకపోవడం మంచిది.

Author