IRCTC : ఇకపై తత్కాల్ ట్రైన్ టికెట్లను శరవేగంగా పొందండిలా…!

IRCTC : ట్రైన్ జర్నీ చేసేవారికి తత్కాల్ టికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు ప్రయాణం చేసేవారు రెగ్యులర్ టికెట్లు అందుబాటులో లేనప్పుడు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. కానీ ఈ టికెట్లను ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకోవడం కుదరని పని. తత్కాల్ టికెట్లు పొందాలంటే కనీసం ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏసీ బోగీలో టికెట్లు పొందాలంటే కనీసం 10 గంటల నుండి 11 అందుబాటులో ఉంటుంది. ఇక నాన్ ఏసి టికెట్లు పొందాలంటే కనీసం 11 గంటల నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే వాస్తవానికి ఈ తత్కాల్ రిజర్వేషన్ టికెట్లు దొరకడం అనేది అంత సులువు కాదు. చాలామంది ఈ టికెట్లను బుక్ చేసే లోపే సమయం అయిపోతుంది. ఇలాంటివారు తత్కాల్ ట్రైన్ టికెట్ ను వేగంగా బుక్ చేసుకోవాలి అంటే ఈ విషయాలను పాటించాల్సిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
IRCTC : ఇకపై తత్కాల్ ట్రైన్ టికెట్లను శరవేగంగా పొందండిలా...!
IRCTC : ఇకపై తత్కాల్ ట్రైన్ టికెట్లను శరవేగంగా పొందండిలా…!

IRCTC : అకౌంట్ తప్పనిసరి…

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారికి కచ్చితంగా IRCTC లో ఎకౌంటు ఉండాలి. ఒకవేళ మీకు ఈ అకౌంట్ లేనట్లయితే IRCTC అధికారిక వెబ్ సైట్ https:www.irctc.co.in లేదా IRCTC యాప్ ఓపెన్ చేసి అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ అకౌంట్ తీసుకున్న తర్వాత My Account Section పై క్లిక్ చేయాలి. అనంతరం మాస్టర్ జాబితాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనిలో మీ పేరు వయసు, జెండర్, పుట్టిన తేదీ ,వివరాలు , ఫుడ్ డీటెయిల్స్, కావాల్సిన బెర్త్ , సీనియర్ సిటిజెన్ అలాగే మీ ఐడి కార్డ్ కరెక్ట్ చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా వివరాలన్నింటినీ ముందే యాడ్ చేసుకోవాలి.

Advertisement

ఇక ఈ వివరాలతో పాటు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వివరాలను కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం దాదాపు 20 మంది ప్రయాణికుల వివరాలను మీరు ముందుగానే నమోదు చేయొచ్చు. అందులో ఆధార్ వెరిఫై అయిందో లేదో చూసుకోవాలి. అలాగే మీరు టికెట్లు బుక్ చేసుకున్న సమయంలో ఒకసారి జర్నీ చేసేటప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మందికి లోయర్ బర్త్ ఇచ్చే ఆప్షన్ కనిపించదు. ఈ విధంగా చేస్తే చాలు మీ తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లు.

IRCTC : ఇకపై తత్కాల్ ట్రైన్ టికెట్లను శరవేగంగా పొందండిలా...!
IRCTC : ఇకపై తత్కాల్ ట్రైన్ టికెట్లను శరవేగంగా పొందండిలా…!

IRCTC : ఎలా బుక్ చేయాలంటే…

అయితే మీరు ఏసి భోగి లకు చెందిన టికెట్లను బుక్ చేయాలి అనుకుంటే IRCTC వెబ్ సైట్ లేదా యాప్ ను 9:57 గంటలకు స్లీపర్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే 10:57 గంటలకు లాగిన్ అవ్వాలి.లాగిన్ అయిన తర్వాత ఎవరైతే జర్నీ చేయాలనుకుంటున్నారో వారి పేర్లను సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టేషన్ పేరు సెలెక్ట్ చేసి జర్నీ చేసే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ పై గరిష్టంగా నాలుగు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు. అంతకంటే ఎక్కువ టికెట్లు బుక్ చేయలేరు.

ఆ తర్వాత కోచ్ సెలెక్ట్ చేసుకుని జర్నీ చేసే వివరాలు ఎంటర్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మీ వివరాలను మాస్టర్ జాబితాలో సేవ్ చేయడం వలన ఆటోమేటిక్ గా అక్కడ డిస్ ప్లే అవుతాయి.ఆ తర్వాత మీ వివరాలను ఒకసారి చూసుకుని పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి మీ పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మై బుకింగ్ ట్యాబ్ లో మీ టికెట్లను మీరు చూసుకోవచ్చు. మీ సీట్లు కన్ఫామ్ అయినప్పుడు మీ మెయిల్ ఐడి కి అలాగే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు మీ సీట్ నెంబర్లు ,కోచ్ వివరాలు వస్తాయి. ఈ విధంగా మీరు వేగంగా తత్కాల్ లో మీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది