Bilva Leaves : సర్వరోగ దివ్య ఔషధం.. మారేడు దళం.. ఖాళీ కడుపుతో తింటే అద్భుతమైన ప్రయోజనాలు…!

Bilva Leaves : మారేడు ఆకులు అంటే శివుడికి ఎంతో ఇష్టం. మారేడు దళాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు ఆ శివయ్య నెరవేరుస్తాడని నమ్మకం. అంత గొప్ప మారేడు దళాలు పూజకే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మారేడు దళాన్ని వేసవిలో ఖాళీ కడుపుతో పచ్చి ఆకును తీసుకుంటే ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు.. మలబద్ధకం లేదా ఉదయం సరిగ్గా పడుకుని ఖాళీ చేయని సందర్భాల్లో తక్షణ ఉపశమనం పొందవచ్చు ఈ మారేడు దళాలతో.. ఇది మీ పొట్టను శుభ్రపరచడమే కాకుండా మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ మారేడులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, కాలుష్యం ఇనుముతో కూడిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో ప్రతిరోజు ఖాళీ కడుపుతో మారేడు దళాలు తింటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు గురించి వివరంగా తెలుసుకుందాం..

తరచూ నోటి పూతతో ఇబ్బంది పడేవారు ఖాళీ కడుపుతో మారేడు ఆకులను తీసుకోవడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది. దీనికోసం మీరు నాలుగు మారేడు ఆకులు తీసుకుని పచ్చిగానే నమిలి తీసుకోవచ్చు.. అలాగే మధుమేహం బాధితులకు సైతం ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. మారేడు దళం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. డయాబెటిస్ పేషెంట్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో మారేడు దళాన్ని తీసుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు తినడం వలన అజీర్ణం నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. మారేడు దళాలలో ఉండే క్యాల్షియం దంతాల ఎముకలను దృఢంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి నుంచి బయటపడేస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం ఎలర్జీలతో ఇబ్బంది పడే వారికి ఈ మారేడు దళాలు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడతాయి.

Bilva Leaves : సర్వరోగ దివ్య ఔషధం.. మారేడు దళం.. ఖాళీ కడుపుతో తింటే అద్భుతమైన ప్రయోజనాలు...!
Bilva Leaves : సర్వరోగ దివ్య ఔషధం.. మారేడు దళం.. ఖాళీ కడుపుతో తింటే అద్భుతమైన ప్రయోజనాలు…!

మారేడు ఆకులను ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం..  మారేడు ఆకులను ఒక ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి దానిని కషాయంగా తీసుకోవచ్చు.. లేదంటే మారేడు ఆకుల్లో కాస్త నల్ల ఉప్పు వేసి కొద్దిగా వేడి చేసి తీసుకోవచ్చు. కొన్ని ఆకులను తీసుకొని నీటితో శుభ్రం చేసి వాటిని అలాగే తీసుకోవచ్చు.. మారేడు ఆకులు ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని తినడం వల్ల గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తీసుకుంటే దానిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యానికి మంచిది. మారేడు ఆకులు ధమనులు గట్టి పడకుండా నిరోధించే గుణం ఉంది. ఇవి గుండె వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఈ మారేడు పత్రంలో పొటాషియం అధికంగా ఉండడం ఉన్న రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు చేస్తుంది. మారేడు ఆకులలో ఉండే ఐరన్ రక్తంలో ఎర్ర రక్తకణాలు హిమోగ్లోబిన్ ని పెంచుతాయి. మారేడు ఆకులలో ఉండే కార్బోహైడెడ్లు వలన శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది