Bank Employee : వీడి దుంప తెగ‌.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు దొంగ‌గా మారిన బ్యాంక్ ఉద్యోగి

Bank Employee : ప్రేమ‌కి ఎల్ల‌లు, హ‌ద్దులు అనేవి ఉండ‌వ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలుసు. కులం,మ‌తం, ప్రాంతంతో సంబంధం లేకుండా చాలా మంది జంట‌లు ప్రేమించుకుంటారు. కొంద‌రు పెద్ద‌ల‌ని ఎదిరించి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఇక ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఒక‌రికొక‌రు గిఫ్ట్‌లు ఇచ్చుకోవ‌డం ప‌రిపాటి. ప్రేమించుకునే స‌మ‌యంలో ఒక‌రికొక‌రు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావ్ అని అడిగి మరీ గిఫ్ట్‌లు తీసుకుంటున్నారు. అమ్మాయిలు అయితే అకేష‌న్‌కి ప్రియుడిని ఏదో ఒక గిఫ్ట్ అడ‌గ‌డంతో వాడు డ‌బ్బులు లేక‌పోయిన అప్పో సొప్పో చేసి మ‌రీ గిఫ్ట్‌లు కొని ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

Bank Employee : వీడి దుంప తెగ‌.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు దొంగ‌గా మారిన బ్యాంక్ ఉద్యోగి
Bank Employee : వీడి దుంప తెగ‌.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు దొంగ‌గా మారిన బ్యాంక్ ఉద్యోగి

Bank Employee ప్రేమ‌లో మున‌గ‌డంతో..

వేదం సినిమాలో కేబుల్ రాజు క్యారెక్టర్ చూసే ఉంటారు. ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి న్యూ ఇయర్ పార్టీకి పిలిచిందని హోటల్ లో ఎంట్రీ పాస్ లు కొనేందుకు డబ్బులు లేకపోతే దొంగతనం చేయడానికి కూడా రెడీ అవుతాడు. ఆ తర్వాత కేబుల్ రాజు తన తప్పు తెలుసుకుని ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి హీరో అవుతాడు. కానీ నిజ జీవితంలో ఈ వ్యక్తి మాత్రం జీరో అయ్యాడు.ప్రియురాలి కోసం దొంగగా మారాడు. ప్రేమించిన అమ్మాయికి ఖరీదైన బహుమతులు, లగ్జరీ వస్తువులు ఇవ్వడం కోసం.. లవర్ తో కలిసి ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్ చేయడానికి దొంగతనాలు చేయడం మొదలెట్టాడీ బ్యాంక్ ఉద్యోగి.

ఎంసీఏ చదివిన కుమార్ చెన్నైలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్ కి నెలకు 30 వేల రూపాయలు జీతం వస్తుంది. ఇతనికి ఒక లవర్ ఉంది. తన లవర్ కి గిఫ్టులు కొనేందుకు తన జీతం సరిపోవడం లేదని.. దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. టి నగర్ లోని శరవణ ఎలైట్ స్టోర్ లో ఒక బంగారు ఉంగరం చోరీ చేశాడు. ఉస్మాన్ రోడ్ లోని శరవణ ఎలైట్ స్టోర్స్ లో మరో దొంగతనం చేశాడు. అయితే షాప్ సిబ్బంది కుమార్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో దొంగతనం చేసిన డబ్బులతో తన లవర్ కి బహుమతులు కొని ఇచ్చేవాడినని కుమార్ చెప్పుకొచ్చాడు. పలు లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేదని విచారణలో తేలింది. లగ్జరీ లైఫ్ కోసం ఇలా చేసినట్లు తెలిపాడు. ల‌వ‌ర్ కోసం చెత్త ప‌నులు చేసి క‌ట‌క‌టాలు పాలయ్యాడు.

Author