Revanth Reddy : దేశంలోనే తొలిసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy : గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే తొలిసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, జేఎన్టీయూ వైస్ చాన్సెలర్ బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.

Telangana cm revanth reddy speech at jntu Hyderabad

ఈసందర్భంగా మాట్లాడిన సీఎం.. ఈ అకాడెమిక్ ఇయర్ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ఇంజినీరింగ్ కాలేజీలకు సాయం అందించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాలేజీలు నిరుద్యోగులను తయారు చేయకూడదు. సివిల్ ఇంజినీరింగ్ లాంటి ముఖ్యమైన కోర్సులను కంటిన్యూ చేయాలి. కొన్ని కాలేజీల్లో అసలు సివిల్ ఇంజినీరింగ్ లేకుండా చేస్తున్నారు. సివిల్ తో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు కూడా ఉండాలన్నారు.

అలాగే.. తెలంగాణలో త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దానికి అటానమస్ హోదా కూడా ఇస్తామన్నారు. నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Author