Hair Transplant : ఈ కాలంలో జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరులో కనిపిస్తున్న సమస్య. స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం వాతావరణం మరియు జీవనశైలి మార్పు వలన జుట్టు రాలడం వంటి సమస్యకు గురవుతున్నారు. ఈ ఆధునిక పద్ధతుల వలన మానవుల సమస్యలను సులభంగా పరిష్కారం చేస్తున్నాయి. చేతిలో డబ్బు ఉంటే జుట్టు రాలడం అనేది పెద్ద సమస్య ఏమి కాదు. ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతిలో ఉడిన జుట్టుని తిరిగి పొందుతున్నారు. ఇది ఒక మార్పిడి మాత్రమే కాదు దీనికి కొన్ని నియమాలు ఉన్నాయట. ఎయిమ్స్ డెర్మటాలజిస్ట్ గ్లోబల్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ బోర్డ్ సర్జన్ డా.అమరేంద్ర కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.
Hair Transplant : జుట్టు మార్పిడికి అనువైన వయసు ఏది..?
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఒక వయసు కొన్ని నియమాలు ఉంటాయి. సరైన వయసులో మార్పిడి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ని 25 నుండి 75 సంవత్సరాల వరకు చేయవచ్చు. అలాగే 25 సంవత్సరాలు లోపు ఉన్నవారికి మార్పిడి చేయకూడదని వైద్యులు తెలిపారు. ఈ వయసులో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వలన భవిష్యత్తులో కొన్ని దుష్ఫలితాలు ఎదురవుతాయని చెబుతున్నారు. అలాగే జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది.
Hair Transplant ఉత్తమ ఫలితాలను ఎప్పుడు పొందవచ్చు.
ఉత్తమ ఫలితం ఎలా ఉంటుంది అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తి మరియు జుట్టు పొందే వ్యక్తి జుట్టు నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందికి 20 ఏళ్లకే జుట్టు రాలడం మొదలవుతుంది. అలాంటివారు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ని చేయించుకోవాలి అనుకుంటే సహజంగా వచ్చే జుట్టుపై ప్రభావం పడుతుంది.
జుట్టు రాలిపోయే సమస్య ఎప్పుడు కనిపిస్తుంది..?
పురుషులకి 30 నుంచి 40 సంవత్సరాల వయసులో ఈ సమస్య మొదలవుతుంది. స్త్రీల విషయంలో అయితే హార్మోన్ల పై ఆధారపడి ఉంటుంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మరికొంత సమాచారం.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ని చిన్న వయసులో లేదా వృద్ధాప్యం లో చేయకూడదు. దీనికి సరైన వయసు 35 నుంచి 50 వయసులో చేయించుకోవాలి. ఒకవేళ యువకులు దీనిని చేయించుకోవాలి అనుకుంటే భవిషత్తుపై ప్రభావం పడుతుంది. 60 ఏళ్ల తర్వాత జుట్టు మార్పిడికి తక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ వయసులో ఆరోగ్య సమస్యల పై ప్రభావం పడవచ్చు.
భారతదేశంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అధికంగా పెరుగుతుంది. 2025 నాటికి 140 మిలియన్లు అధికంగా పెరగవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అందరికీ అందుబాటు ధరకి మారిపోతుందని టెక్‌స్కీ పరిశోధన తెలిపింది. ఈ నేపథ్యంలోనే 2016-2020 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జుట్టు మార్పిడి చికిత్స 16% పెరిగింది. అమెరికా దక్షిణ కొరియా టర్కీ మొదటి వరుసలో ఉన్నారు. అయితే ఈ జుట్టు మార్పిడి విషయంలో అన్ని దృష్టిలో ఉంచుకొని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే అది మరింత విజయవంతం అవుతుంది.