Diabetes : మధుమేహం ఉన్నవారు రైస్ ఇలా వండితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Diabetes : అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనదేశంలో అన్నం ప్రధానమైనది. అన్నంలో కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉండడం వలన ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే అన్నం శరీరాన్ని దృఢంగా ఉంచడానికి మరియు శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుంది. అదేవిధంగా వైట్ రైస్ లో గ్లూటెన్‌ ఉండదు. అలాగే విటమిన్ బి పొటాషియం ఐరన్ వంటివి లభిస్తాయి. అన్నంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి హై బీపీ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఆహారంలో అన్నం చేర్చుకోవచ్చు. కాని ఈ అన్నం వాడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Diabetes : మధుమేహం ఉన్నవారు రైస్ ఇలా వండితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Diabetes : మధుమేహం ఉన్నవారు రైస్ ఇలా వండితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

అన్నం వండే ముందు బియ్యాన్ని వేయించుకుని ఆ తరువాత ఎక్కువ నీళ్లతో బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అన్నం వండుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ విధంగా వైట్ డ్రెస్ వండుకున్నట్లయితే మంచి పోషకాలు అందుతాయని అలాగే శరీరానికి మంచి ఫలితాలను ఇస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. బియ్యాన్ని వేయించుకోవడం ద్వారా అందులోని పిండి పదార్థాలు తగ్గుతాయట. అదేవిధంగా అన్నం జిగటగా కాకుండా మంచిగా పొడి పొడి లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా దీనిని డయాబెటిక్ పేషెంట్లు తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

అన్నాన్ని వండుకునే ముందు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన బియ్యాన్ని సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వండుకున్నట్లయితే అన్నం పొడిపొడి లాడుతూ ఉంటుంది. అలాగే బియ్యం పై ఉన్న మట్టి మరియు ఇతర కణాలు తొలగిపోతాయి. ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీరు సరిపోతుంది. అలాగే బియ్యం ఆధారంగా కూడా నిష్పత్తి మారుతూ ఉంటుంది. అదేవిధంగా అన్నం వండేటప్పుడు అందులో రుచి కోసం కొంచెం ఉప్పు వేసి వండుకోవచ్చు. దానితో పాటుగా వండుతున్న అన్నంలో వన్ టీ స్పూన్ నెయ్యి నీ వేసుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది. అలాగే అన్నం అంటుకోకుండా వస్తుంది. ఇకపోతే అన్నం తింటేనే ఆరోగ్యం అనుకోకూడదు. అన్నానికి తగ్గట్లుగా కూరగాయలు పండ్లు , ప్రోటీన్లు తప్పకుండా తీసుకోవాలి. బరువు తగ్గాలి అనుకునే వారు అన్నాన్ని మాత్రమే తినడండా ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామాలు కూడా చేయాలి. యోగా ధ్యానం ఎక్సైజ్ వంటివి చేయడం మంచిది.తద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.

Author