Non veg : నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి…!

Non veg : ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ పక్క ఉండాల్సిందే. అలాగే పండగలు వచ్చిన , బంధువులు వచ్చిన నాన్ వెజ్ పెట్టడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇంకా కొందరికి అయితే ముక్క లేనిదే ముద్దు దిగదు. ఇప్పుడు అలాంటి వారికి ఒక బ్యాడ్ న్యూస్. మేకలు, కోళ్లు, చాపలు ,రొయ్యలు, గొర్రెల పెంపకంలో యాంటీ బయటిక్స్ వాడకం పెరిగిపోయింది. ఇక ఇందులో మల్టీ డ్రగ్స్ రెసిస్టెన్స్ ఎక్కువైందని అధికారుల స్టడీలో తేలింది. ఈ విషయం తెలియడంతో నాన్ వెజ్ లవర్స్ నిరశపడుతున్నారు. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలో 2019 , 2022 మధ్యకాలంలో శాంపిల్స్ ని పరీక్షించగా అసలు సంగతి బయటపడింది.

Non veg : నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా... అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి...!
Non veg : నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి…!

అలాగే కొన్ని బ్యాక్టీరియా ఆనవాళ్లపై పరిశోధనలు నిర్వహించగా అందులో ఆవులు బర్రెలు తప్ప మిగతా అన్నిటిలో యాంటీ బయాట్రిక్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. వారంలో ఒక్కరోజైనా మాంసాహారం తినకపోతే ముద్ద దిగదు. అలాంటి వారికి ఈ విషయం తెలియడంతో ఏం తినాలన్న భయపడుతున్నారు. ఇక నాన్ వెజ్ లో యాంటీ బయాట్రిక్స్ ఉండడంతో ఇది మనుషుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ఇటు నాన్ వెజ్ తినలేక అటు మానుకోలేక.. అయినా తిని రోగాల భారీన పడే ధైర్యం చేయలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో కోళ్ల పెంపకం వేగంగా పెరగడం కోసం సైరాయిడ్స్ ఇస్తున్నారని వైద్యులు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కోళ్లను తినడం వలన వాంతులు, విరోచనాలు , ఫుడ్ పాయిజన్ వంటివి జరిగి ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే ఫారంలో పెంచే కోళ్లను కాకుండా ఇంట్లో పెంచే కోళ్లను తినడం మంచిదని చెప్పుకొచ్చారు. సైరాయిడ్ లేని మాంసాహారాన్ని తిని మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇటీవల విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ వెటర్నరీ అధికారి మాంసం విక్రయించే వారు నిబంధనలు పాటించే విధంగా ర్యాండమ్ గా చెక్ చేస్తామని అలాగే ఎవరైనా నిబంధనలు ఉల్లంగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా విక్రయానికి పనికిరాని కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్ముతున్నట్లయితే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Author