Pooja Niyamalu : పూజ ఎక్కడ ఎలా చేస్తే మంచిది… పుణ్యక్షేత్రాలలో చేస్తేనే ఫలితం ఉంటుందా…!

Pooja Niyamalu : కొంతమంది ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది వారి వెసులుబాటును బట్టి పుణ్యక్షేత్రాలలో పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ పూజ చేసుకుంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో పూజ చేస్తే ఫలితం వస్తుందా ఆలయాలలోకి వెళ్లి పూజ చేస్తే మంచి ఫలితం వస్తుందా అని అంటే ఫలితం అనేది మనో నిబ్బరంతో కూడి ఉన్న విధానానికి సంబంధించినది. అంతేగాని ఇంట్లో పూజ చేస్తే తక్కువ వస్తుంది. ఆలయంలో పూజ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనేది తప్పు.

Pooja Niyamalu : పూజ ఎక్కడ ఎలా చేస్తే మంచిది... పుణ్యక్షేత్రాలలో చేస్తేనే ఫలితం ఉంటుందా...!
Pooja Niyamalu : పూజ ఎక్కడ ఎలా చేస్తే మంచిది… పుణ్యక్షేత్రాలలో చేస్తేనే ఫలితం ఉంటుందా…!

ఎక్కడైనా దృఢ నిశ్చయంతోటిి మనసా వాచా కర్మణా దేవుడి మీద దృష్టి భక్తి శ్రద్ధల తోటి ఫలం పుష్పం ఆకు పెట్టి నమస్కరించుకోండి. లేదా నీళ్లను పోసిన దేవుడు సంతోషిస్తాడు. అయితే పుణ్యక్షేత్రా ఆలయంలో అన్నీ కూడా క్షేత్రా నిర్మాణాలతోటి యంత్ర ప్రతిష్ట తోటి ప్రాణ ప్రతిష్టల తోటి చేసినవి. భక్తిశ్రద్ధలతో చేస్తే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. అన్నిచోట్ల లాభం ఉంటుంది. అలాగే భక్తి ప్రధానం లేకపోతే ఏం చేసినా వృధా అవుతుంది. భక్తితోటే ముక్తి ఇస్తారు ముక్తి కలగాలి అంటే భగవంతుడిని ప్రార్థించాలి. భగవాన్మస్కారణ తో ఏ పూజ చేసినా మంచి ఫలితాలను పొందవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్లిన ఫలితం వేరు పూర్వజన్మ సుకృతంగా వచ్చే నిదానంగా అది ఇస్తారు.

నిత్యం ఇంట్లో నిత్య దీపారాధన అఖండ దీపారాధన చేసుకుంటే ఉండే దాంట్లో మీ మనసులో ఉన్న ఆలోచనలు తొలగించి కుటుంబ సభ్యులకు ఏ లోటు లేకుండా చీకుచింత లేకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పడానికే ఈ పూజా విధానం. అంతేగాని పుణ్యక్షేత్రాలకు వెళితే మంచిది ఇంట్లో చేసుకుంటే మంచిది అనేది ఏమీ ఉండదు. దైవత్వాన్ని నమ్మి పూజ చేసేటప్పుడు త్రికరణశుద్ధితో చెయ్యాలి. పూజ చేసిన తర్వాత ప్రసాదంగా అన్నదానాలను చేయాలి. కాబట్టి ఎక్కడ చేసిన పూజ చేసే విధానాన్ని బట్టి మంచి ఫలితాలను పొందవచ్చు.

Author