Dhanu Rashi : ధనుస్సు రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది…? అలాగే ఏ రాశి వారిని వివాహం చేసుకోకపోవడం మంచిది…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…ధనస్సు రాశి అంటే బాణం గుర్తు. వీరు ప్రతి విషయాన్ని గురు చూసి మాట్లాడతారు అని అర్థం. అలాగే వీరిని తెలివైనవారు అని కూడాా చెప్పవచ్చు. వీరికి సరి సమానమైన వారు రాకపోతే వారిని తక్కువ అంచనా వేయడం లాంటివి ఉంటాయి. లేదా వీరికంటే తెలివైన వారు వస్తే వీరు భరించకపోవడం ఉంటుంది. వివాహం అనేది రెండు మసుల కలయిక. ధనస్సు రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదంటే ధనుస్సు రాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోకూడదు. ధనుస్సు రాశి వారి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు. మకర రాశి వారు ఏ విషయం అయిన తెలివి ఎలా దాటాలో నేర్చుకుంటారు. కాబట్టి మీరు వివాహం చేసుకోకూడదు.
అలాగే కుంభరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే వీరు ధనుస్సు రాశి వారికి వ్యతిరేకంగా ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారిని మరియు తులారాశి వారిని వివాహం చేసుకోకూడదు. వీరిని వివాహం చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వీరికి ఉండే ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అదేవిధంగా ధనుస్సు రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందంటే మీన రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి అలాగే మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వీరికి ప్రతి విషయంలో లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వారి కంటే ఎక్కువగా ఉన్నందున ఇద్దరికీ సరి సమానంగా ఉంటుంది. మిధున రాశి వారు ధనుస్సు రాశి వారు ఏం చెప్తే ఆ విధంగా సర్దుకుపోతారు. ఒకవేళ వివాహం జరిగిన వారు ఉంటే జాతకాలను ఒకసారి చూపించి కొన్ని పరిహారాలను చేసుకోవాలి.
పరిహారాలు…
లక్ష్మీనరసింహస్వామిని పూజించడం. సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయడం. ప్రతి శనివారం ఏదో ఆలయానికి వెళ్లి 16 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే శనివారం పూట నవగ్రహాల ప్రదక్షిణ అలాగే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వలన ఎటువంటి దాంపత్య జీవితంలో అయిన గొడవలు ఉన్న అది అన్యోన్య దాంపత్య జీవితం గా మారుతుంది.