Chicken : మాంసాహార ప్రియుల్లో చికెన్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. కోడి మాంసంతో ఎన్నో రకాల రుచికరమైన వంటలను తయారు చేసుకోవచ్చు. అయితే చికెన్ తినటం మంచిదే. కానీ చికెన్ ఉత్పత్తి అవుతున్న తీరు మనకు ఆందోళన కలిగిస్తుంది. మీరు కొనుక్కొని తినే చికెన్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే హానికరమైన విషయాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ నివేదికలు పేర్కొన్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ లోని లేబొ రేటరీ పరిశోధనలో చికెన్ లో 40 శాతం యాంటీబయాటిక్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి అని కనుక్కున్నారు. చికెన్ లో ప్రోటీన్లు, విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి అని తెలిపారు. కానీ ప్రస్తుతం కొన్ని పరిశోధనలు దీనిని తినే వ్యక్తులలో రోగ నిరోధక శక్తి అనేది బలహీన పడవచ్చు అని యాంటీబయా టిక్స్ కు తక్కువ అవకాశం ఉంది అని కూడా తెలిపారు.
Chicken : మీరు కూడా చికెన్ తిన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి
కోళ్లకు ఇతర రకాల వ్యాధుల నుండి రక్షించేందుకు లేక వేగంగా పెరగటానికి బరువు పెరగటానికి యాంటీబయాటిక్స్ ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారు. కావున మీరు గనక చికెన్ తిన్నట్లయితే అది మీ శరీరం పై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఎందుకు అంటే. చికెన్ లోని యాంటీబయాటిక్స్ అనేవి శరీరంలోకి వెళ్తాయి. దీంతో మీ శరీరం అనేది దానికి అలవాటు పడుతుంది. అయితే ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు ఈ యాంటీ బయాటిక్ అనేవి తగినంత వేగంగా పనిచే యలేవు. కావున వారికి ఎక్కువ మోతాదులో ఇస్తుంటారు. ఇవన్నీ అంశాలు కూడా శరీరానికి హాని కలిగిస్తాయి అని తెలిపారు…
Chicken : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఏమిటంటే
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారి టైంలో యాంటీ బ యాటిక్ విచక్షరహితంగా ఉపయోగించారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. కానీ ఇప్పుడు కూడా చాలా మంది యాంటీబయా టిక్ ప్రభావాన్ని చూడడం లేదు. దాదాపుగా 75 శాతం మంది రోగులు యాంటీబయాటిక్స్ తో చికిత్స పొందుతున్నారు అని WHO నివేదిక తెలిపింది. కానీ అది పని చేయనప్పుడు ఎక్కువ మోతాదులో అవసరం. శరీరం కూడా దానికి ప్రతిస్పందించటం ఆపే టైం వస్తుంది అని నివేదికలో తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి టైంలో యాంటీబయాటిక్ వాడకం అనేది బలంగా ఉన్నది.
తూర్పు మధ్యధర,ఆఫ్రికన్ ప్రాంతాలలో ఇది 83% వరకు పెరిగింది. అయితే పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలలో ఇది 33 శాతం వరకు పెరిగింది. తీవ్రమైన కోవిడ్ 19 ఉన్న వ్యక్తులకు ఎక్కువ మోతాదులో యాంటీబయటిక్స్ ఇచ్చినట్లుగా నివేదికలు తెలిపారు. రోగికి యాంటీబయటిక్ అవసరమైనప్పుడు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అనవసరంగా ఉపయోగించినప్పుడు కూడా అవి ప్రమాదాలను కలిగిస్తుంది. జనవరి 2020,మార్చి 2023 మధ్య 65 దేశాలలో ఆసుపత్రులలో చేరిన 4,50,000 మంది రోగుల డేటా ఆధారంగా చూస్తే, ఈ ఫలితాలు అనేవి కనుక్కున్నట్లుగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ లోని లేబొరేటరీ పరిశోధనలో తేలింది…