Heartburn : గుండెల్లో మంటా… ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే చిటికెలో ఉపసమనం…!!

Heartburn : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్ల వలన ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యలలో ఒకటి గుండెల్లో మంటా. గుండెల్లో మంట సమస్య అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించింది. ఇది తప్పుడు ఆహారపు అలవాట్లు వలన మరింత తీవ్రంగా మారుతుంది. దీనినే హాట్ బర్న్ లేక యాసిడ్ రీప్లేక్స్ అని కూడా అంటారు. దీని కోసం ఎన్నో రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఇంట్లో కొన్ని సహజ పద్ధతుల ద్వారా కూడా సమస్యలను తొలగించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రెమెడీస్ మీ గుండెల్లో మంట మరియు అసౌకర్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

ఆపిల్ సైడర్ వెనిగర్ : ఆపిల్ సైడర్ వెనిగర్ హాట్ బర్న్ నుండి ఉపశమనం ఇస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ రెండు టీ స్పూన్లు ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగినట్లయితే ఎసిడిటీ తొలగిపోయి బరువు కూడా అదుపులో ఉంటుంది…

Advertisement

లవంగం : గుండెల్లోని మంట విషయానికొస్తే లవంగాలు కూడా చాలా ప్రయోజకంగా పనిచేస్తాయి. మీరు కూడా ఆహారం జీర్ణం కాలేదు అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే రెండు లవంగాలను నోట్లో వేసుకొని చప్పరించండి. లవంగాల వినియోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి నోటి దుర్వాసనను కూడా దూరం చేయడంలో ఇది ఎంతో సహాయం చేస్తుంది. మీ గుండెల్లో ఉన్న మంటను తొలగించాలి అనుకుంటే సెలరీ ని వాడటం మంచిది. సెలేరి అంటే కొత్తిమీర ఆకు కూర అలాంటిది. దీనిని ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే తాగటం లేక కషాయం చేసుకొని కూడా తాగవచ్చు. ఈ రెండు పద్ధతులను మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలను తొలగిస్తుంది.

కలబంద రసం : అజీర్ణం మరియు గ్యాస్ లేక అసిడిటీ లాంటి వాటి నుండి ఉపసపనం అందించడంలో కూడా కలబంద రసం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనికోసం మీరు దాని గుజ్జు నుండి రసం తయారు చేసుకుని తాగాలి. ఇది జీవక్రియ రేటును కూడా మెరుగుపడేలా చేస్తుంది..

మజ్జిగ : మజ్జిగ తాగటం వల్ల కూడా గుండెల్లోనే మంట నుండి ఉపశమనం పొందవచ్చు. దీనిలో ఉండే అసిడిక్ ఎలిమెంట్స్ అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ లాంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో దీనిని తీసుకోవటం వలన మీ పొట్టను చల్లగా కూడా ఉంచుతుంది…

Author