Garuda Purana : ఈ తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గినట్టే… గరుడ పురాణం ఏం చెబుతుందంటే…!

Garuda Purana : హిందూ పురాణ గ్రంథాలలో అనేక రకాల జీవన విధానాలు పేర్కొనడం జరిగింది. ఇక ఈ జీవన విధానాలను అనుసరించడం వలన ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అయితే హిందూ పురాణాలలో గరుడ పురాణం కి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూమతంలోని 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటిగా పరిగణించబడింది. ఇక ఈ గరుడ పురాణం యొక్క ఆది దేవుడు విష్ణువు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఈ గరుడ పురాణంలో అనేక రకాల సమాచారాలు పేర్కొనబడ్డాయి. అంతేకాదు ఒక వ్యక్తి తన యొక్క జీవితానికి ఏ విధంగా బాధ్యత వహిస్తాడు అనే విషయాలను కూడా గరుడ పురాణంలో వివరించారు. ఇక ఈ గరుడ పురాణంలో మనిషి జీవించడానికి కొన్ని నియమాలను కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే జీవితంలో ఎప్పుడూ ఏ పనులు చేయాలి..?ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాక నిజ జీవితంలో మనిషి తెలిసి తెలియక చేసే తప్పులు కారణంగా వారి యొక్క ఆయుష్ కూడా తగ్గుతుందని గరుడ పురాణంలో పేర్కొనడం జరిగింది. అయితే గరుడ పురాణం పేర్కొనబడిన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Garuda Purana : గరుడ పురాణం ప్రకారం ఈ పనులు చేయకూడదు…

స్మశాన వాటికకు దూరంగా ఉండాలి… గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి మృతదేహాన్ని స్మశాన వాటికలో దహనం చేస్తున్న సమయంలో వెలువడే పొగకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మనిషి మృతదేహం దహనం అవుతున్న సమయంలో పొగతోపాటు విషపూరితమైన వాయువులు కూడా వాతావరణంలోకి కలుస్తాయి. ఇక ఈ విషపూరిత మూలకాలలో అనేక రకాల వైరస్ లు ఉంటాయి. ఇక ఈ సమయంలో సమీపంలో ఉన్నవారు ఈ వాయువును పీల్చుకున్నట్లైతే వారి శరీరంలోకి ఇది ప్రవేశించి అనేక రకాల జబ్బులకు దారితీస్తుంది.

Advertisement
Garuda Purana : ఈ తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గినట్టే... గరుడ పురాణం ఏం చెబుతుందంటే...!
Garuda Purana : ఈ తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గినట్టే… గరుడ పురాణం ఏం చెబుతుందంటే…!

Garuda Purana త్వరగా నిద్ర లేవకపోవడం….

ప్రస్తుత కాలంలో చాలా మంది ఉదయం లేవకుండా బారెడు పొద్దు వచ్చే వరకు అలాగే నిద్రిస్తున్నారు. అయితే గరుడ పురాణం ప్రకారం దీర్ఘాయుష్షు పొందాలి అంటే ఇలాంటి అలవాట్లను మార్చుకోవాలి. పురాణ గ్రంథాల ప్రకారం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొనడం జరిగింది. అంతేకాక ఉదయం వీచే గాలి చాలా స్వచ్ఛమైనది కావడంతో ఈ గాలి మానవులను ఎంతగానో రక్షిస్తుంది.

Garuda Purana రాత్రి సమయంలో పెరుగు తినడం…

గరుడ పురాణంలో పేర్కొన్న అంశాల ప్రకారం రాత్రి సమయంలో పెరుగు అసలు తినకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో పెరుగు తినడం వలన అనేక రకాల వ్యాధులు వస్తాయట. ఇది మానవుని జీవితకాలం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక రాత్రి సమయంలో మిగిలిపోయిన మాంసాహారాలను కూడా తినకూడదు.

Garuda Purana ఈ మార్గాలను అవలంబించకూడదు…

గరుడ పురాణాల ప్రకారం కొన్ని రకాల చర్యలకు పాల్పడడం వలన అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీని కారణంగా మనిషి పాపాలు పెరిగి ఆయుష్షు తగ్గుతుంది. అదే సమయంలో స్త్రీలు మరియు పిల్లలు మానవత్వం పట్ల ఆలోచనతో లేనివారు వారి యొక్క ఆయుష్ ను వారే తగ్గించుకున్న వారు అవుతారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది