Heart Attacks : గుండెపోటు నుంచి కాపాడే పండ్లు ఇవి.. అస్సలు మిస్ చేయొద్దు..!

Heart Attacks : ఈ రోజుల్లో గుండెపోటు అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒకప్పుడు చాలా తక్కువ మందికి వచ్చేది. కానీ ఇప్పుడున్న జీవన విధానాల వల్ల ఎక్కువ మంది గుండెపోటుతో చనిపోతున్నారు. చిన్న వయసు వారిలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వస్తోంది. అంతే కాకుండా ధమనులు, సిరలకు అడ్డంకిగా కొలెస్ట్రాల్ ఏర్పడటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. హార్ట్ ఎటాక్ మాత్రమే కాదండోయ్.. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం లాంటివి కూడా వచ్చే ప్రమాదాలు ఉంటాయి.

Advertisement

Heart Attacks : అలాంటి ఆహారాలు తినడం వల్ల..

వీటిని నివారించాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో అందరూ జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. దాంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతోంది. అయితే ఈ కొలెస్ట్రాల్ ను కూడా కొన్ని పండ్లను తినడం వల్ల తగ్గించుకోవచ్చు.డ్రైఫ్రూట్స్ సిరలు, ధమనుల్లో అడ్డుపడే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాబట్టి రోజూ డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటేమంచిదని చెప్పుకోవాలి. ఎక్కువగా పిస్తా, జీడిపప్పు, అంజీర పండ్లను తీసుకుంటే చాలా మంచిదని అంటున్నారు డాక్టర్లు. ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Heart Attacks : గుండెపోటు నుంచి కాపాడే పండ్లు ఇవి.. అస్సలు మిస్ చేయొద్దు..!
Heart Attacks : గుండెపోటు నుంచి కాపాడే పండ్లు ఇవి.. అస్సలు మిస్ చేయొద్దు..!

దాంతో పాటు స్ట్రాబెర్రీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వేతి వాతావరణంలో స్ట్రాబెర్రీలను తింటే మాత్రం కచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి గుండె ఆగిపోకుండా చూస్తాయని చెప్పుకోవాలి.ఇక అవకాడో కూడా చెడు కొవ్వును తగ్గిస్తుంది. ఈ పండ్లలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఈ కొవ్వు అనేది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించేస్తుంది. దాంతో పాటు దానిమ్మ పండ్లు కూడా గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు సాయం చేస్తుంటాయి. ఇలాంటి మంచి పండ్లను తింటే ఆరోగ్యంగా ఉంటాము. అయితే తినకూడనివి కూడా ఉంటాయి. అందులో టీ, కాఫీలు, ఫ్రై చేసిన, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు తినొద్దని అంటున్నారు డాక్టర్లు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday