Hardik Pandya : ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై శకం ముగిసింది. హార్ధిక్ నాయకత్వంలో బరిలోకి దిగిన ముంబై జట్టు భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఆడిన పదకొండు మ్యాచ్‌లలో మూడు మాత్రమే గెలిచింది. ఎనిమిది ఓడింది. ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నప్పటికీ అవి గెలిచిన కూడా వేస్టే. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ సేన 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి కోల్ కతా బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకు ఆలౌట్ అయింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (56; 35 బంతుల్లో) మెరుపులు మెరిపించినా , టిమ్ డేవిడ్ గట్టిగా ఆడిన కూడా తమ జట్టుని గెలిపించలేకపోయారు.
Hardik Pandya : పాండ్యాపై ఫైర్..
ముంబై బ్యాట్స్‌మెన్స్ ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ(11), నమన్ ధీర్ (11), తిలక్ వర్మ (4), నేహాల్ వధేరా (6), హార్దిక్ పాండ్యా (1), టిమ్ డేవిడ్ (24) ఇలా స్టార్ బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ముంబైకు మరో ఓటమి తప్పలేదు.. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, వరుణ్ 2, నరైన్ 2, రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ లో వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చింది. దీంతో ముంబై జట్టు ఫీల్డింగ్ కు రోహిత్ దూరమయ్యాడు. రోహిత్ ను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్ లో భాగస్వామిని చేయకపోవడం పట్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబై ప్లేఆఫ్స్‌కి వెళ్లకపోవడంపై కూడా కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ని కెప్టెన్సీ నుండి తప్పించినందుకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు.