Mega Family : రాజుకుంటున్న రాజ‌కీయం.. మెగా ఫ్యామిలీ తేల్చుకోబోతుందా?

Mega Family : మెగా ఫ్యామిలీ అనే పదానికి ఆద్యుడు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న పేరు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొని తెలుగులో అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగారు. చిరంజీవి స్పూర్తిగా ప‌వ‌న్ సినిమాల‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ త‌ర్వాత జ‌న‌సేన అనే పార్టీని స్థాపించి ఇప్పుడు రాజ‌కీయాల‌లో త‌న‌దైన మ‌ద్ర వేస్తున్నారు. మ‌రోవైపు చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు సైతం ఇప్పుడు రాజ‌కీయాల‌లోనే ఉన్నారు.సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున వారు రాజ‌కీయాల‌పై త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. అయితే రాజ‌కీయాల‌లోకి రాక‌పోయిన మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మాములుగా లేదు.

Advertisement
Mega Family : రాజుకుంటున్న రాజ‌కీయం.. మెగా ఫ్యామిలీ తేల్చుకోబోతుందా?
Mega Family : రాజుకుంటున్న రాజ‌కీయం.. మెగా ఫ్యామిలీ తేల్చుకోబోతుందా?

Mega Family : రాజ‌కీయం మెగా ఫ్యామిలీకి ఇమ‌డ‌ట్లేదా?

చిరంజీవికి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ద‌క్క‌గా, ఆయ‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. అత‌నికి అభిమానులు క‌న్నా భ‌క్తులు ఎక్కువ ఉంటారు. తెలుగు సినిమా రంగంలో ఈజీగా వంద కోట్లని పై దాటి ఒక ప్రాంతీయ చిత్రం వసూల్ చేయగల సత్తా కలిగిన నటులలో పవన్ కూడా ఒకరు. అలాగే చిరంజీవి సోద‌రుడు రామ్ చ‌ర‌ణ్‌కి పాన్ ఇండియా క్రేజ్ ఉంది.అలానే అల్లు అర్జున్ పుష్ప‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్నాడు. ఈ ఫ్యామిలీ హీరోలు కూడా మంచి సినిమాల‌తో టాప్‌లోనే ఉన్నారు. కాని ఎందుకో ఈ మ‌ధ్య మెగా ఫ్యామిలీ రాజ‌కీయాల వైపు దృష్టి పెడుతుండ‌డం చ‌ర్చ‌న‌యాంశంగా మారింది.

Advertisement
Mega Family : రాజుకుంటున్న రాజ‌కీయం.. మెగా ఫ్యామిలీ తేల్చుకోబోతుందా?
Mega Family : రాజుకుంటున్న రాజ‌కీయం.. మెగా ఫ్యామిలీ తేల్చుకోబోతుందా?

2008లోచిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. అయితే ఆయ‌న పార్టీ పెట్టింది రాంగ్ టైంలో. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 2014లో చేస్తే మాత్రం బాగుండేది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టిన టైం టైమింగ్ తప్పు కావడంతోనే ఆయన దెబ్బ తిన్నారు . జనసేన ప్రస్థానం పదేళ్ళుగా చూస్తున్నాం. దాని వ‌ల‌న ఎవ‌రికి పెద్ద‌గా ఒరిగిందేమి లేదు. ఇక నాగ‌బాబు కూడా ప‌వ‌న్ వెంట తిరుగుతున్నారు. వారు జ‌గ‌న్‌కి వ్య‌తిరేఖంగా పోరాటం చేస్తున్నారే త‌ప్ప మిగ‌తా వారి గురించి ఆలోచిచండం లేద‌ని అర్ధ‌మ‌వుతుంది. అశేషమైన జనాభిమానం తో పాటు బలమైన సామాజిక వర్గం కూడా అండగా ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయంలో వారు చేస్తున్న చిన్న చిన్న త‌ప్పులు సోపానంని అధిరోహించ‌లేకుండా చేస్తున్నాయి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday