AP Assembly Gate : ఏపీ అసెంబ్లీ వద్ద ఉన్న రెండో గేటును జగన్ సర్కార్ అమరావతి రైతులు రాకుండా అడ్డుగా ఉండేందుకు గోడను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ గోడ ఇప్పుడు కూలింది. ఆ గేటు ఇప్పుడు తెరుచుకుంది. ఏపీ అసెంబ్లీ రెండో గేటు తాజాగా తెరుచుకోవడంతో అమరావతి రైతులు, స్థానికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో గేటును మూసేస్తూ జగన్ ప్రభుత్వం గోడ కట్టింది.
అమరావతి రాజధానిని ముక్కలు చేయాలని ప్రయత్నించిన జగన్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఉద్యమించిన విషయం తెలిసిందే. వాళ్లు అసెంబ్లీలోకి దూసుకురాకుండా ఉండేందుకు అప్పటి సీఎం జగన్ గేటును మూసేస్తూ గోడ కట్టించి దాన్ని పూర్తిగా మూసేయించారు.
తాజాగా ఆ గేటును టీడీపీ ప్రభుత్వం తెరిచింది. అడ్డుగా ఉన్న ఆ గోడను కూల్చేసింది. ఇది ప్రజా అసెంబ్లీ.. ప్రజాస్వామ్య నిలయమైన అసెంబ్లీ గేట్లు ఎప్పటికీ తెరిచే ఉండాలి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం.. ప్రజలు వాళ్ల సమస్యలను తెలపడానికి కనీసం అవకాశం కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత.. అంటూ ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు రెండో గేటు తెరుచుకున్న సందర్భంగా వ్యాఖ్యానించారు.