Praneeth Hanumanth : సోషల్ మీడియాలో తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇతడి గురించే చర్చ నడుస్తోంది. ఓ తండ్రీకూతురుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని దేశమంతా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రణీత్ ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది.
బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసి అతడిపై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బెంగళూరులోని స్థానిక కోర్టులో పోలీసులు అతడిని హాజరుపరిచి ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు. ప్రణీత్ తో పాటు సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అతడి ఫ్రెండ్స్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Praneeth Hanumanth : తన ఫ్రెండ్స్ తో వీడియో చాట్ చేస్తూ పిచ్చి కూతలు
యూట్యూబ్ చానెల్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలపై పిచ్చి కూతలు కూయడం వీళ్లకు పరిపాటి. అలా.. తండ్రికూతురు బంధంపై పిచ్చి కూతలు కూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు ప్రణీత్ పై మండిపడ్డారు.