Landslide : ఇలాంటి భయానక వీడియోను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. లైవ్ లోనే జనాలంతా చూస్తుండగానే కొండచరియలు విరిగిపడటంతో అక్కడ ఉన్న ప్రయాణికులు పరుగు లంఖించుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటేనే అందరికీ తెలుసు.. కొండలు, గుట్టలు ఎక్కవగా ఉంటాయి. ఆ కొండలు, గుట్టల మధ్య నుంచే రోడ్లు ఉంటాయి. హైవేలు కూడా ఉంటాయి. భారీగా వర్షాలు కురిస్తే ఆ రోడ్లను మూసేస్తారు. దానికి కారణం.. ఆ గుట్టలు, కొండలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో.
కానీ.. ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొండచరియలు భారీ వర్షాలకు బాగా నానిపోయి రోడ్ల మీద విరిగిపడుతూనే ఉంటాయి. తాజాగా భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీలో బద్రీనాథ్ కు వెళ్లే హైవేపై ప్రయాణికులంతా చూస్తుండగానే కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లైవ్ షాకింగ్ వీడియో.. చూస్తుండగానే విరిగిపడిన కొండచరియలు.. భయంతో పరుగులు పెట్టిన జనం
ఉత్తరాఖండ్ – చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీసారు. pic.twitter.com/guAQKQckin
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024