Gadwal Vijayalaxmi : బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా పలువురు రాజకీయ నేతలు ఎల్లమ్మ దర్శనం కోసం అక్కడికి వెళ్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంటే కళ్యాణానికి ప్రభుత్వం తరుపున హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు…
ప్రభుత్వం తరుపున వచ్చినా మంత్రి, మేయర్ అని చూడకుండా ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి గుడిలోకి వెళ్లకుండా పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అలిగి గుడి బయటే కూర్చున్నారు.
Gadwal Vijayalaxmi : ప్రోటోకాల్ పాటించరా?
ప్రభుత్వం నుంచి వస్తే ప్రోటోకాల్ పాటించరా? అంటూ టెంపుల్ అధికారులపై మంత్రి పొన్నం, మేయర్ ఫైర్ అయ్యారు. వాళ్లు ఎంత బతిమిలాడినా గుడిలోకి వెళ్లలేదు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/TeluguScribe/status/1810540160251277649