Brahmanandam : అందరి ముందు కమల్ హాసన్ వాయిస్‌ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. కమల్ ఏమన్నారో తెలుసా? వీడియో వైరల్

Brahmanandam : కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. ఒక లెజెండ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. విక్రమ్ తర్వాత కమల్ కు చాలా సినిమా ఆఫర్లు వచ్చినా.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం భారతీయుడు 2 మీద పెట్టారు.

Advertisement

brahmanandam imitated kamal haasan at bharateeyudu 2 event

Advertisement

అప్పట్లో వచ్చిన భారతీయుడు సినిమా ఎన్ని రికార్డులు తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు సీక్వెల్ ను తీస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయి విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.

Brahmanandam : ఈవెంట్ లో బ్రహ్మానందం ఫన్.. ఎంజాయ్ చేసిన కమల్ హాసన్

భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కమల్ హాసన్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ కు బ్రహ్మానందం కూడా వచ్చారు. స్టేజీ ఎక్కి సినిమా గురించి మాట్లాడిన తర్వాత సడెన్ గా బ్రహ్మానందం.. కమల్ వాయిస్ ను ఇమిటేట్ చేశారు. అందరికీ నమస్కారములు. ఈరోజు నేను భారతీయుడు 2 లో యాక్ట్ చేశాను. భారతీయుడు వన్ బాగా హిట్ చేశారు. ఈ సినిమాకు అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. సౌత్ ఇండియా అంతా నన్ను ఆశీర్వదించారు. అభినందించారు. నాకు మాటలు ఎక్కువగా రావడం లేదు. సంతోషంగా ఉంది. మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మీరందరూ సక్సెస్ చేస్తే నేను హ్యాపీ. థాంక్యూ అంటూ బ్రహ్మానందం.. కమల్ వాయిస్ ను ఇమిటేట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Author