Viral Video : డ్యూటీ పక్కన పెట్టి మందుబాబులతో కలిసి మద్యం సేవించి చిందులేసిన పోలీస్.. వీడియో వైరల్

Viral Video : పోలీసు అంటే ప్రజలకు రక్షణగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మనకు ఏదైనా ఆపద వస్తే ముందుగా గుర్తొచ్చేది కూడా పోలీసే. కానీ.. ఓ పోలీస్ మాత్రం తన డ్యూటీని పక్కన పెట్టి మందుబాబులతో కలిసి కూర్చొని మద్యం తాగి చిందులేస్తూ అడ్డంగా నెటిజన్లకు దొరికిపోయాడు. ఈ ఘటన ఏపీలోని ఒంగోలులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Advertisement

ongole SI dance video viral in Andhra Pradesh

Advertisement

జిల్లాలోని ముండ్లమూరు మండలంలోని శంకరాపురం అనే గ్రామంలో ఓ గొడవ జరిగింది. రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలకు చెందిన వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు కూడా అయ్యాయి. ఈనేపథ్యంలో కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మళ్లీ గొడవలు జరగకుండా ఉండేందుకు.. ఆ గ్రామానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఒంగోలు ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు.

Viral Video : విధిని మరిచి మద్యం సేవించిన వెంకటేశ్వర్లు

అయితే.. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు.. గ్రామంలో విధులు నిర్వర్తించడం పక్కన పెట్టి.. గ్రామ శివారుకు వెళ్లి అక్కడ మందుబాబులతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం మందుబాబులతో కలిసి చిందులేశాడు. ఆ సమయంలో అక్కడున్న వాళ్లు వీడియో తీసి పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు.

ఆ వీడియో చూసిన పోలీసు ఉన్నతాధికారులు.. ఏఎస్ఐ వెంకటేశ్వర్లును వేకెన్సీ రిజర్వ్ కు పంపిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ జారీ చేశారు. ఇక.. ఆ వీడియో కూడా స్థానికంగా సంచలనం సృష్టించింది. గ్రామంలో గొడవలు జరగకుండా విధులు నిర్వర్తించాల్సింది పోయి.. మందుబాబులతో కలిసి మద్యం సేవిస్తూ చిందులు వేయడం ఏంటంటూ స్థానికంగా ఆ పోలీసుపై ప్రజలు మండిపడుతున్నారు.

Author