Amaravathi : ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడే రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రాజధానిగా అమరావతిని కన్ ఫర్మ్ చేస్తూ అక్కడ పనులు మొదలు పెట్టారు. ఐతే గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ మూడు రాజధానులు అని చెబుతూ కాలం వెల్లదీశారు తప్ప ఎక్కడ అంతగా డెవలప్ చేయలేదు. అంతేకాదు ఫారినర్స్ నుంచి ఇన్వెస్ట్ మెంట్ చేయించే దిశగా అసలు అడుగులు వేయలేదు. కానీ బాబు వచ్చీ రాగానే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు సంబందించిన ఇన్వెస్టర్స్ వచ్చారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ అమరావతి వచ్చి సిఆర్డిఏ కమిషనర్ భాస్క ర్ తో చర్చలు జరిపారు. పారిశ్రామిక పెట్టుబడులకు అమరావతి ఎంతో సౌకర్యవంతమైన ప్రదేశంగా.. రానున్న రోజుల్లో ఇది ఎంతో గొప్ప వాణిజ్య నగరంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అవ్వడమే ఆలస్యం అనుభవం ఉన్న ఈ నాయకుడి తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పెట్టుబడీ దారులు ఆలోచిస్తున్నారు.
విదేశీ సంస్థలు రాజధానీలో పెట్టుబడి పెట్టేందుకు వారికి తగిన అవకాశాలను కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ ఉన్నప్పుడు అంతగా ఆసక్తి చూపించని పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు ని కలిసి తమ ఆస్క్తిని తెలియచేస్తున్నారని తెలుస్తుంది. అమరావతికి కావాల్సిన పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేశంలో చెప్పుకోదగ్గ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దేలా ఆయన ప్రణాళిక చేస్తున్నారు.
Amaravathi ఇన్వెస్టర్స్ ఆకట్టుకునేలా అమరావతి
ఈ క్రమంలో ముందుగా వచ్చిన వారికి కొన్ని సౌకర్యాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఏపీ క్యాపిటల్ అమరావతిని అన్నివిధాలుగా మంచి నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం గా బాబు ఎంపికైన దగ్గర నుంచి అమరావతి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇంకా ఇన్వెస్టర్స్ అందరికీ మంచి అవకాశం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చూస్తుంది. ఏపీలో ఫారిన్ ఇన్వెస్టర్స్ వల్ల అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలో జరిగే అవకాశం ఉంటుంది.