Kidney : మూత్రపిండాలు శరీరంలోనే ముఖ్యమైన అవయవం కిడ్నీ. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందుకే మనం ఆరోగ్యంగా ఉండి మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీ ఆహారం సరిగ్గా లేకపోయినట్లయితే మూత్రపిండ వ్యాధుల భారీన పడే అవకాశం ఉంటుంది.ఇక ఈ వ్యాధి నుంచి బయటపడటం చాలా కష్టం. అయితే మూత్రపిండాలకు మధుమేహం అతిపెద్ద శత్రువుగా పరిగణిస్తారు. అయితే కొన్ని రకాల ఆహారాలు కిడ్నీలకు స్లో పాయిజన్ లా కూడా పనిచేస్తాయి.దీనివల్ల నెమ్మదిగా వీటి పనితీరు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే ముందుగా మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Kidney : ఈ పదార్థాలను తినకండి..
పిండి : పిండితో తయారుచేసిన బ్రెడ్ పిజ్జా వైట్ డ్రెస్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీ శరీరంలో రక్త పోటుస్థాయి పెరుగుతుంది.అలాగే రక్తంలో ఉండే అధిక చక్కెర వలన దీర్ఘకాలంలోనే మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తృణధాన్యాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Kidney : మద్యం
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలతో పాటు శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయి. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వలన శరీరంలో టాక్సీలను అధికంగా పెంచుతుంది.వీటి ద్వారా మూత్రపిండాలు వాటి ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. దీనివలన కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది.
Kidney అధిక ఉప్పు ఆహారాలు.
భారతీయ వంటకాలలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉప్పుని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. అయితే ఇది రక్తపోటుని పెంచడంతోపాటు మూత్రపిండాలపై ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది.కాబట్టి ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడం మంచిది.
Kidney ప్యాక్ చేసిన పండ్ల రసం.
ప్యాక్ చేసిన పండ్ల రసాలలో అధిక మోతాదులో చక్కెర ఉంటుంది. కాబట్టి దీనిని అధికంగా తీసుకోవడం వలన మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
Kidney రెడ్ మీట్…
మాంసాలలో రెడ్ మీట్ , లంబ్ పార్క్ వంటి వాటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అధిక ప్రోటీన్లు తీసుకోవడం కూడా ప్రమాదమే. ఎక్కువ ప్రోటీన్లు తీసుకోవడం వలన కిడ్నీపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ మీకు ఇప్పటికే మూత్రపిండల వ్యాధి ఉన్నట్లయితే రెడ్ మీట్ అసలు తీసుకోకూడదు.
ఈ విధంగా మీ ఆహార పదార్థాలను మెరుగుపరచుకోవడం తో పాటు నీటిని పుష్కలంగా తాగండి. ఇది మూత్రపిండాలలో వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఇది సహాయపడుతుంది.