Ap Govt : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే విజయ అవకాశాల వరకు అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి గల ముఖ్య కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తుతం అమలు చేయాల్సి ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారినట్టుగా తెలుస్తోంది. అంతేకాక ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల మొదటి రోజే జీతాలు ఇచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా టైట్ గా మారినట్టు తెలుస్తున్నాయి.
దీనికి తోడు గత ప్రభుత్వం ఇష్టానుసారం చేసిన అప్పులు మరియు నిధుల సమీకరణ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి భారంగా మారిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జులై 1 నాటికి ఏపీ ప్రభుత్వానికి సుమారు 10వేల కోట్లు అవసరమని తెలుస్తుంది. మరి ఇంత డబ్బును ఎలా సమీకరించాలి అనే దానిపై ప్రస్తుతం సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా పింఛన్లను జూలై 1న ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఒక్క పథకానికే దాదాపు 4408.31 అవసరమవుతారట. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజున జీతాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఆంధ్ర ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలంటే ఏపీ సర్కార్ కి ప్రస్తుతం దాదాపు 10 వేల కోట్లు అవసరం అవుతాయి.
ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఆర్ధిక సంవత్సరంలో తొలి 9 నెలలకు ప్రభుత్వాలు రుణ పరిమితి తీసుకునే విధంగా నిర్ణయిస్తారు. దీనిలో భాగంగానే 2024 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు 47 వేల కోట్లు తీసుకునే వీలు ఉంటుంది. అయితే గత ప్రభుత్వం జగన్ సర్కార్ ఇప్పటికే దానిలో 25 వేల కోట్లను సమీకరించింది. అంటే ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ వరకు మరో 22 వేల కోట్లు మాత్రమే తీసుకునే వీలుంటుంది. దీంతో ప్రస్తుతం ఈ సవాల్ చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది. మరి దీనిని చంద్రబాబు సర్కార్ ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి.