Gautam Gambhir : ద్రవిడ్ పంపిన మెసేజ్ విని గౌతమ్ గంభీర్ భావోద్వేగం.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

Gautam Gambhir : టీమిండియాకు కొత్త కోచ్ వచ్చిన విషయం తెలిసిందే. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీదనే ఇప్పుడు టీమిండియా, క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కొత్త హెడ్ కోచ్ గంభీర్ ట్రెయినింగ్ లో టీమిండియా ఫస్ట్ సిరీస్ ఆడేందుకు కూడా రెడీ అయిపోయింది. ఈనేపథ్యంలో ఈ మ్యాచ్ విషయంలో గంభీర్ కు ధైర్యం చెప్పేందుకు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ వాయిస్ మెసేజ్ పంపించాడు.

Rahul Dravid special message to new coach Gautam Gambhir

రాహుల్ పంపించిన వాయిస్ మెసేజ్ విని గౌతమ్ గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే.. టీమిండియా కోచ్ గా తన అనుభవాలను గంభీర్ తో పంచుకున్నాడు రాహుల్. టీమిండియాతో నా ప్రయాణం ముగిసింది. నేను అనుకున్నదానికంటే గొప్పగానే నా జాబ్ ను నిర్వర్తించా. ముంబైలో నాకు ఘనస్వాగతం లభించింది. అది నేను ఎప్పటికీ మరిచిపోలేను. అవన్నీ నాకు జీవితాంతం గుర్తుంటాయి. కొత్త కోచ్ గా నీకు కూడా ఇలాంటి అనుభవాలు త్వరలోనే ఎదురవుతాయి.. అంటూ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్ పంపించిన వాయిస్ మెసేజ్ విని గౌతమ్ గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. నాకు ఈ విషయంపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదంటూ తెలిపాడు. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోను చూసి క్రికెట్ అభిమానులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.

Author