Dry Coconut : నరాల సమస్యతో బాధపడే వారికి ఎండు కొబ్బరి దివ్య ఔషధం .. దీనితో బోలెడు ప్రయోజనాలు…!

Dry Coconut : సహజంగా అందరూ వంటింట్లో ఎండుకొబ్బరిని వినియోగిస్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయంలో కొబ్బరిని అందరి ఇళ్లలో వాడుతూ ఉంటారు. పూజ నుండి వంట వరకు అన్నిటిలో కొబ్బరిని బాగా వినియోగిస్తారు. ఎండుకొబ్బరిని అనేక వంటకాలు తయారు వేస్తారు. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఎండు కొబ్బరిని ఉపయోగించడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా దాని ఉపయోగం ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎండు కొబ్బరిలో విటమిన్లు, ఐరన్, ప్రోటీన్లు, మాంగనీస్, కాపర్ ,ఫాస్పరస్, సెలీనియం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఎండుకొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఎండు కొబ్బరి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎండు కొబ్బరి వలన కలిగే లాభనష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఎండు కొబ్బరిని అధిక పరిమాణం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.

ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఎండు కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. అందువలన మీరు దీనిని తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ మరియు ప్రోస్టేడ్ క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా తగ్గించుకోవచ్చు.. ఎండు కొబ్బరిని అధికంగా తీసుకుంటే కడుపునొప్పి వాంతులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండిన కొబ్బరిని ఎక్కువగా తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకి మంచిది కాదు.. ఎందుకంటే కొబ్బరిలో చాలా చక్కెర ఉంటుంది. కావున దీన్ని తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అధికమవుతాయి.. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి.

దాని వలన మీరు ఎండు కొబ్బరిని తీసుకుంటే అది మీరు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీరు ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎండు కొబ్బరిని తీసుకోవడం గుండెకి చాలా ఉపయోగకరం. ఎండు కొబ్బరిని రోజు తీసుకుంటే గుండె ఆరోగ్యం గా ఉంటుంది. అలాగే శరీరము కొలెస్ట్రాల్ లెవెల్స్ ను మెరుగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి..కొబ్బరిని పొడి లేదా తడి రూపంలో తినడం వల్ల మన జుట్టుకి చాలా మంచిది. ఎండు కొబ్బరిని తినడం వల్ల మన జుట్టు రాలడం తగ్గిపోతుంది. క్రమంగా కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.

పైగా మీ కేసాలు నల్లటి రంగులో మెరుస్తుంది. అలాగే ఎముకలకు కూడా మేలు జరుగుతుంది. అలాగే ఎముకలకి కూడా మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన ఎముకలు దృఢంగా మారుతాయి. వాటిలోని పగుళ్ళ శబ్దం ఆగుతుంది. ఎండు కొబ్బరి తినడం వలన తలనొప్పితో ఇబ్బంది పడే వారికి చాలా మంచిది. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఎండుకొబ్బరిలు ఐరన్ అధికంగా ఉంటుంది. దాని వలన మీరు దీనిని తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతుంది. దీనివల్ల రక్తం లేకపోవడం తగ్గుతుంది.

ఎండు కొబ్బరి తినడం వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉండగా.. ఏదైనా తీపి లేదా కూరగాయల్లో ఎండు కొబ్బరిని కలుపుకుంటే దాని రుచి అధికమవుతుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అనేక ఇతర వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి బయటపడేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాలను ఈజీగా తగ్గిస్తుంది. కావున తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఎండుకొబ్బరిని ఆహారంలో చేర్చుకోవాలి. ఎండు కొబ్బరి తినడం వల్ల మనం మెదడు పదును పెట్టడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది