Coffee : కాఫీ అధిక మోతాదులో తీసుకుంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా…!!

Coffee : ప్రపంచ వ్యాప్తంగా కాఫీ లవర్స్ ఉంటారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కొంత మందికి కాఫీ తాగనిదే రోజు గడవదు. అంతలా ఎడిట్ అవుతారు. ప్రతిరోజు ఉదయం కాఫీ తాగితే కానీ తమ రోజు మొదలు పెట్టరు. అయితే కాఫీ లిమిట్ గా తాగితే పర్వాలేదు. కానీ, అధిక మోతాదులో తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు కాఫీ ని అస్సలు తీసుకోకూడదు. మీరు మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు అసలు కాఫీ తాగకూడదు. కాఫీ లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు నరాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అంతే రక్త ప్రసరణను కూడా మందగించేలా చేస్తుంది. కెఫిన్ ఎక్కువ మొత్తంలో శరీరంలోకి చేరటం వలన మైగ్రోన్ మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి..

మీకు గనక హై బీపీ ఉంటే, కాఫీ తాగకండి. కాఫీ తాగటం వలన రక్తపోటు స్థాయి అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి దాని వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కాఫీ తాగటం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంతేకాక బీపీలో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు ఉన్నవారు కాఫీ తాగటం మానేయాలి అని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగటం వలన డయాబెటిక్ రోగులకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. రక్తంలోని చక్కర స్థాయి అసమతుల్యంగా ఉన్నవారు కూడా కాఫీ అసలు తీసుకోకూడదు…

గర్భధారణ టైంలో కాఫీ తాగటం అంతా మంచిది కాదు. కాఫీలో ఉంటే కెఫిన్ శాతం శరీరంలోని రక్తప్రసరణను ప్రభావితం చేయగలదు. దీంతో కడుపులో పెరుగుతున్న పిండానికి రక్తం సరఫరాలో సమతుల్యతలు ఏర్పడతాయి. ఒకవేళ మీకు ఒత్తిడిని ఎదుర్కొన్నట్లయితే కాఫీ గురించి అసలు మీరు ఆలోచించవద్దు. నిపుణుల అభిప్రాయ ప్రకారం. కాఫీ ని అధికంగా తీసుకోవటం వలన శరీరంలో కార్టి సోల్ హార్మోన్ పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ఒత్తిడిని మరింత ఎక్కువగా చేస్తుంది…

Author