Alluri Sitarama Raju : స్వాతంత్రం కోసం వీరోచిత పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు కథ…!

Alluri Sitarama Raju : స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులలో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు. ఈయన మన్యం ప్రాంతంలోని గిరిజనుల సహాయంతో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురెళ్ళాడు. ఎన్నో ఏళ్ల పాటు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ వచ్చారు. చివరకు బ్రిటిష్ పోలీసులు అల్లూరి సీతారామరాజును చుట్టుముట్టి గనులతో కాల్చి చంపేశారు. అయితే అల్లూరి మరణం తర్వాత ఆయన పోరాటాన్ని కొనియాడుతూ మహాత్మా గాంధీ ఆనాడే యంగ్ ఇండియా పత్రికలో ఆయన గురించి రాసుకొచ్చారు. దీంతో ఇప్పటికీ అల్లూరి ఉద్యమ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా వాటిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

Advertisement

అంతెందుకు పశ్చిమగోదావరి జిల్లాల నుండి తూర్పు కనుమల వరకు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు ఉద్యమ ఆనవాళ్లు దర్శనమిస్తాయి.ఈ నేపథ్యంలోనే 2002 జూలై 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాలకు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి కూడా పాల్గొన్నారు.

Advertisement

Alluri Sitarama Raju : అల్లూరి సీతారామరాజు నేపథ్యం…

అయితే అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పాండురంగీలో జులై 4 1897లో జన్మించారు.ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగ్గలు. ఆయన తండ్రి వెంకట్రామరాజు ఫోటోగ్రాఫర్. తల్లి సూర్యనారాయణమ్మ. వీరిది మధ్యతరగతి కుటుంబం. అయితే వృత్తిరీత్యా తండ్రి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఉండేవారు. దానికి అనుగుణంగానే అల్లూరి సీతారామరాజు కూడా కుటుంబంతో పాటు వివిధ ప్రాంతాలకు తిరగాల్సి వచ్చింది. దీంతో ఆయన గోదావరి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నరసాపురం ,రాజమహేంద్రవరం , రామచంద్రపురం ,తుని ,కాకినాడ వంటి ప్రదేశాలలో విద్యాభ్యాసం చేశారు.

Alluri Sitarama Raju : స్వాతంత్రం కోసం వీరోచిత పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు కథ...!
Alluri Sitarama Raju : స్వాతంత్రం కోసం వీరోచిత పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు కథ…!

అయితే అల్లూరి సీతారామరాజు 6వ తరగతి చదువుతున్న సమయంలో గోదావరి పుష్కరాల్లో వ్యాపించిన కలరా వ్యాధి వలన తండ్రి మరణించారు. తండ్రి మరణం తర్వాత సీతారామరాజు గారి చదువులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలోనే ధ్యానంలో దిగిపోవాలని లక్ష్యంతో 1916లో అల్లూరి ఉత్తరాది పర్యటన చేపట్టారు. వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించి తీర్థయాత్రలు చేశారు. అనంతరం 1918లో సొంత గడ్డకు తిరిగివచ్చారు. ఇక తర్వాత 1919లో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాలను అల్లూరి సీతారామరాజు గుర్తించారు. వారికి న్యాయం చేయడం కోసం పోరాటాలు చేశారు. అడవి ఉత్పత్తులను కొల్లగొట్టడం , గిరిజనులకు తగిన కూలి ఇవ్వకపోవడం అంటే అంశాలపై అల్లూరి సీతారామరాజు ప్రభుత్వాన్ని నిలదీసి గిరిజనుల సమీకరించి పోరాటం చేశారు.

Alluri Sitarama Raju మూడేళ్ల పాటు సాయుధ సమరం…

ఈ విధంగా 20 ఏళ్లు కూడా నిందని వయసులోనే అల్లూరి సీతారామరాజు అడవి బాట పట్టి తూర్పుగోదావరి మరియు విశాఖ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం జరిగేందుకు పనిచేశారు. ఈ క్రమంలోనే బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలపై తిరుగుబాటు కూడా చేపట్టారు. మరి ముఖ్యంగా మన్యంలో ముఠాదారులుగా పిలిచే స్థానిక పెద్దలతో కలిసి బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి దోపిడీలు ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించాయి. వాటన్నింటిని చూస్తూ విసిగిపోయిన అల్లూరి చివరికి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అది కాస్త కొన్నాళ్లకు సాయుధ పోరాటంగా మారింది. ఈ నేపథ్యంలోనే అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో మన్యం పోరాట వీరులంతా కలిసి బ్రిటిష్ పోలీసులపై దాడులు చేశారు. అంతేకాక దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక్కరోజులో వెళ్లి అల్లూరి సీతారామరాజు ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది .

Alluri Sitarama Raju : స్వాతంత్రం కోసం వీరోచిత పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు కథ...!
Alluri Sitarama Raju : స్వాతంత్రం కోసం వీరోచిత పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు కథ…!

దీంతో గిరిజన ప్రజల్లో అల్లూరికి ఆదరణ కూడా విపరీతంగా పెరిగింది. దీంతో చాలామంది ఆయన వద్ద మహిమలు ఉన్నాయని కూడా భావించేవారు. ఆ విధంగా దాదాపు మూడేళ్లపాటు సాయుధ పోరాటం సాగింది. ఎలాగైనా అల్లూరిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు మలబార్ సైన్యాన్ని రంగంలో దింపారు. అయినా సరే అదుపు చేయలేకపోవడంతో అస్సాం రైఫిల్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే అస్సాం రైఫిల్స్ కు అల్లూరి పట్టుబడ్డాడు. తీవ్రంగా సాగిన ఓ పోరాటంలో గాయపడిన అల్లూరి కొయ్యూరు సమీపంలో గల పంపా వాగు వద్ద గాయాలను శుభ్రం చేస్తుండగా రైఫిల్స్ అధికారులు అల్లూరిని పట్టుకున్నట్లుగా రికార్డులలో నమోదయింది.

అయితే నిజానికి అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ఆయనను ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక ఈ కేసును 1924 మే 7వ తేదీన అల్లూరి తప్పించుకుని పారిపోయే సమయంలో కాల్చి చంపినట్లుగా మేజర్ దళాలు నివేదికలో ప్రకటించాయి. అల్లూరి మరణం తర్వాత ఆయన మృతదేహాన్ని కృష్ణ దేవి పేటకు తరలించారు. అక్కడే ఆయన దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం అల్లూరి స్మృతి వనంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆయన మరణంతో సాయుధ పోరాటం ముగిసినప్పటికీ ఆయన స్ఫూర్తి మాత్రం అలాగే కొనసాగుతుందని చెప్పాలి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది