Team India : హమ్మయ్య.. ఎట్టకేలకు టీమిండియా ఆటగాళ్లు భారత్ కు చేరుకున్నారు. టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ లో తొలిసారి అడుగు పెట్టారు టీమిండియా ప్లేయర్స్. అందుకే వాళ్లకు క్రికెట్ అభిమానులంతా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఢిల్లీకి స్పెషల్ విమానంలో చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఎక్కడెక్కినుంచో వచ్చిన క్రికెట్ అభిమానులు స్వాగతం పలికారు. నేషనల్ ఫ్లాగ్స్ ఊపుతూ వాళ్లకు ఘనస్వాగతం పలికారు.
ఇక.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశారు. జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న మ్యాచ్ ముగియగానే.. జూన్ 30న టీమిండియా భారత్ కు రావాల్సి ఉంది కానీ.. బార్బడోస్ లో బెరిల్ హరికేన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు.
Team India : టీమిండియా కోసం స్పెషల్ ఫ్లైట్ ను పంపిన ఎయిర్ ఇండియా
అయితే.. టీమిండియా కోసం ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ ను పంపించడంతో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు సమావేశమయ్యారు. మోదీని కలిసిన అనంతరం.. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరారు.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబైలో టీమిండియా ఆటగాళ్ల రోడ్ షోను నిర్వహించనున్నారు. అనంతరం.. రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లకు సన్మానం చేయనుంది.